ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎక్కువ సంపాదించేది హీరోలే. ఆ తర్వాత స్థానంలో ఉంటే హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుంటారు. ఈమధ్య కొంతమంది దర్శకులు కూడా ఎక్కువగానే ఆర్జిస్తున్నారు. మరి కమెడియన్స్ పరిస్థితేంటి?
ప్రతి ఇండస్ట్రీలో హాస్యనటులున్నారు. కానీ ఆదాయంతో వాళ్లు హీరోలతో పోటీపడలేరు. అయితే ఓ హాస్యనటుడు మాత్రం చాలా రిచ్ అంటోంది బాలీవుడ్ మీడియా. ఇంకా చెప్పాలంటే సౌత్ లో ప్రభాస్, రజనీకాంత్ కంటే అతడి ఆస్తి (నెట్ వర్త్) ఎక్కువని చెబుతోంది.
ఆ కమెడియన్ పేరు బ్రహ్మానందం. హాస్యబ్రహ్మ చాలా రిచ్ అంట. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన సినిమాల కౌంట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది. అత్యథిక సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కిన ఘనత మన హాస్య బ్రహ్మది.
దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు బ్రహ్మానందం. ఒక టైమ్ లో బ్రహ్మానందం లేని సినిమా లేదు. దాదాపు అదే టైమ్ లో కొంత మంది హీరోలతో సమానంగా, మరి కొంత మంది హీరోల కంటే ఎక్కువగా రెమ్యూనమరేషన్ తీసుకున్న ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అలా పేరుతో పాటు, వందల కోట్ల రూపాయల ఆస్తి కూడా వచ్చిచేరింది.
అంతెందుకు, తాజాగా వచ్చిన కల్కి సినిమాలో కూడా బ్రహ్మానందం ఉన్నారు. ఆ మూవీకి ఆయన అటు ఇటుగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న బ్రహ్మి, చాలామంది హీరోల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు.
తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం అంటే ఓ ఎమోషన్. ఈ తరం కూడా ఎమోజీలు, మీమ్స్ తో ఆయనను గుర్తు చేసుకుంటోందంటే, అదీ ఆయన స్థాయి. బాలీవుడ్ లో పాపులర్ అయిన కపిల్ శర్మ అయినా, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జానీ లీవర్ అయినా మన బ్రహ్మానందం తర్వాతే.
I am happy to see vulnerable comments are actively moderated in this site. Please do continue or turn off comments section.
Many, in the name of opinions spoiling the culture of exchanging views and thoughts using harsh language.
he became a snowflake so cannot tolerate comments
Call boy jobs available 8341510897
Akkineni family tarvatha athyantha pisinarodu ante brahmanandame…He doesn’t take out a single penny from his pocket for anyone!
There is no end to giving no end to taking….. may be its his personal choice !
ఆయన పిసినారి అయితే నీ కెందుకు దానకర్ణుడయితే నీకెందుకు.ఇక్కడ టాపిక్ అయన కామెడీ నటన మరియు సక్సెస్ఫుల్ కెరీర్ గరించి.
its his money. good that he managed well.
చిత్తూరు నాగయ్య గారు వున్న ఆస్తి అంతా దానాలు చేసి, చివరి రోజుల్లో నిరుపేద గా, తినడానికి తిండి లేక చనిపోయారు. అతని వద్ద సహాయం పొందిన వాళ్ళు ఎవరు అతన్ని అడుకోలేదు చివరి రోజుల్లో.
ఆ సంఘటన వలన తెలివి కలిగి , బ్రహ్మానందం లాంటి వాళ్ళు జాగ్రత్త పడ్డారు., తమకి వున్నది పోగొట్టుకోకుండ జాగ్రత్త పడ్డారు.
బ్రహ్మానందం గారు ఎవనిరి దోచుకోలేదు. తన హక్కుగా వచ్చిన డబ్బు నే దాచుకున్నారు.
కొడుకు మీద ట్రై చేశారు, కానీ వర్క్ అవ్వడం లేదు అని ఆపేసారు.
దానం చేయమని ప్రతివాడు చెప్పేవాడే, కానీ అలా ఇచ్చిన వారికి ఆడుకునే మనస్సు ఎవడికి లేదు.
జనం పట్టించుకోరు
థియేటర్ కంటే ఓటిటి బెస్ట్