ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లిన టీడీపీ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట కౌంటింగ్ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇవాళ కౌంటింగ్ నిమిత్తం టీడీపీ తరపున ఏజెంట్‌గా రమేశ్ వెళ్లారు. అక్కడ ఆయన గుండెపోటుకు గురి అయ్యారు. హుటాహుటిన ఆయన్ను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లలో సహజంగానే కాస్త ఆందోళన ఎక్కువే వుంటుంది. గెలుపోటములను దగ్గరుండి చూడాల్సి వస్తుందనే భావన వారిలో వుంటుంది. అయితే కౌంటింగ్ మొదలు కాకుండానే, టీడీపీ ఏజెంట్ గుండెపోటుకు గురికావడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
అందుకే కౌంటింగ్‌కు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు వెళ్లకపోవడమే మంచిది. కౌంటింగ్ ఒత్తిడి తట్టుకోలేక గుండె పోటుకు గురి కావడం, లేదా ఫలితం తమకు అనుకూలంగా రాని పరిస్థితిలో ఆవేశానికి లోనై ప్రత్యర్థులతో గొడవలకు దిగడం లాంటివి చేస్తుంటారు. విపరీతంగా ఆవేశానికి లోనయ్యే వాళ్లను కౌంటింగ్‌కు పంపకుండా రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. గుండెపోటు లాంటి చేదు వార్తలు వినకూడదని కోరుకుందాం.