టీడీపీ కూటమికి పదవులే పదవులు

బూర్ల గంపలో పడినట్లుగా టీడీపీ కూటమి నేతల పరిస్థితి ఉంది. పదవులే పదవులు వారిని వరించి వస్తున్నాయి. విశాఖపట్నంలో వైసీపీ నుంచి రెండంకెల సంఖ్యలో కార్పోరేటర్లు వచ్చి కూటమిలో చేరుతున్నారు. దాంతో జీవీఎంసీలో మేయర్…

బూర్ల గంపలో పడినట్లుగా టీడీపీ కూటమి నేతల పరిస్థితి ఉంది. పదవులే పదవులు వారిని వరించి వస్తున్నాయి. విశాఖపట్నంలో వైసీపీ నుంచి రెండంకెల సంఖ్యలో కార్పోరేటర్లు వచ్చి కూటమిలో చేరుతున్నారు. దాంతో జీవీఎంసీలో మేయర్ సీటు దక్కుతుంది. అది టీడీపీ నేతకే ఆఫర్ ఉంది

దీనితో పాటుగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు వస్తారు. అందులో చెరొకటి జనసేన, బీజేపీలకు దక్కుతాయని అంటున్నారు. దీంతో పాటు ఆగస్టు నెలలో స్థాయీ సంఘం చైర్మన్ పదవులు పది ఖాళీ అవుతాయి. కూటమికి జీవీఎంసీలో మెజారిటీ ఉంది కాబట్టి ఆ పదవులు కూడా చాలా మందికి లభిస్తాయి.

ఇలా కూటమికే పదవుల పందేరం సాగుతోంది. వైసీపీ జెండాను దించేసి టీడీపీ కూటమి జెండాను జీవీఎంసీలో ఎగరేసినందుకు ఈ ప్రతిఫలాలు అన్నీ దక్కుతున్నాయి. గత మూడున్నరేళ్లుగా ఒక్క స్థాయీ సంఘం చైర్మన్ పదవి కూడా టీడీపీ మిత్రపక్షాలకు లభించలేదు.

ఇప్పుడు కరవు తీరా ఈ పదవులు అన్నీ వారి ఖాతాలోకే వెళ్ళబోతున్నాయి. వైసీపీ విషయానికి వస్తే ప్రతిపక్షానికి పరిమితం కాబోతోంది. విశాఖ సిటీలో కార్పోరేషన్ పదవులు దక్కడం అంటే విలువైనదిగానే చూడాలి. దాంతో కూటమికి చెందిన కార్పోరేటర్లకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. మరో ఏణ్ణర్థం పాటు జీవీఎంసీలో కూటమి పాలన సాగనుంది. తొందరలోనే స్థానిక సంస్థల చట్టంలో మార్పులు తెస్తూ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుందని అంటున్నారు.

దాని ప్రకారంగా చూస్తే రెండున్నరేళ్ళకే అవిశ్వాసం పెట్టవచ్చు అని ఈ సవరణలో చేర్చుతారని అంటున్నారు. అది జరిగితే గత మూడున్నరేళ్ళుగా అధికారంలో ఉన్న విశాఖ మేయర్ మీద అవిశ్వాసం పెట్టి గద్దె దించుతారని అంటున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ జరగవచ్చు అని అంటున్నారు. దానికి ముందు ఒక చిన్న టెస్ట్ గా ఆగస్టులో స్థాయి సంఘం ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరి మెజారిటీ ఏంటి అన్నది కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుందని అంటున్నారు.

14 Replies to “టీడీపీ కూటమికి పదవులే పదవులు”

  1. వైసిపి పార్టి ఇక ఫుల్ క్లోజ్. వైసిపి పార్టీ లొ ఒక్క తిక్కలోడు జగన తప్ప.

      1. నువ్వు చెప్పినివి మూసుకునే అసెంబ్లీ కి రాకుండా హస్తినకు జంప్ అని బయట ప్రజలు, నెటిజన్లు అనుకుంటున్నారు ..

  2. బీజేపీ కి ఉన్నదే ఒకరిద్దరు కార్పొరేటర్ లు అయితే డిప్యూటీ మేయర్ ఇచ్చేస్తారా?

  3. పదవులు వాళ్లకు వస్తే మధ్యలో నీదేదో పోయినట్టుగా పెద్ద ఫీల్ అయిపోతున్నావు కదరా గ్యాస్ ఆంధ్ర. మరీ ఇంత కడుపు మంట నా ?

Comments are closed.