స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూటమి టార్గెట్

ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఖాళీలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ కోటా నుంచి తొందరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీగా…

ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఖాళీలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ కోటా నుంచి తొందరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. విశాఖ కోటాలో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ 2021లో వైసీపీ తరఫున గెలిచారు.

ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ రాఘురాజు టీడీపీకి ఎన్నికల్లో సహకరించారు అని వైసీపీ ఫిర్యాదు మేరకు ఆయన మీద శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి ఖాళీగా ప్రకటించవద్దు అని కోర్టు ఆదేశించింది.

అయితే ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మరో మూడున్నరేళ్ళ దాకా పదవీ కాలం ఉన్న ఈ రెండు పోస్టులను లోకల్ బాడీ కోటాలో వైసీపీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ పోస్టుల మీద కూటమి టార్గెట్ చేసింది. దాంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తమ వైపునకు తిప్పుకుంటోంది. జీవీఎంసీలో పెద్ద ఎత్తున కార్పోరేటర్లను చేర్చుకోవడం ద్వారా మేయర్ పదవిని సొంతం చేసుకోవడంతో పాటు ఎమ్మెల్సీ సీటుని కూడా దక్కించుకోవాలన్నది కూటమి ప్లాన్ అని అంటున్నారు.

విజయనగరంలో కార్పొరేషన్, జిల్లా పరిషత్తు చైర్మన్ రెండూ వైసీపీ చేతిలో ఉన్నాయి. అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కూటమి బలపడుతుందని అంటున్నారు. దాంతో ఎపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఈ రెండు పదవులూ తమ ఖాతాలోకి వేసుకోవడానికి చూస్తోందని అంటున్నారు. వైసీపీ నుంచి ఆపే ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఏ మాత్రం ఫలించకపోవడంతో చేష్టలుడిగి చూస్తోంది అని తెలుస్తోంది.

7 Replies to “స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూటమి టార్గెట్”

  1. జగన్ గాడి స్క్రిప్ట్ పేపర్ పోలీసులు నిన్న చించారని ఇంకా ఏడుస్తుంటే, మరల ఈ గోల ఏంటో.

  2. ఇన్నిరోజులు వైస్సార్సీపీ అధికారం లో సంపాదించి మళ్ళీ టీడీపీ లో చేరి అక్కడ సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్ ముందు ఇంకో పార్టీ లోకి జంప్ చేసే వాళ్ళు బాగుంటారు కానీ పార్టీ ని నమ్ముకున్న వాళ్ళు ఏమి కావాలి

    1. రాముడే పొత్తుల తోనే గెలిసాడు రావణుడిని ఎదిరించి. పొత్తులు లేకుండా ఏ యుద్ధము గెలవలా, ఇది చరిత్ర. జగ్గడు ఒక్కడే హీరో అనుకుంటే, జీరోగా మిగిలిపోతాడు.

    2. రాముడు పొత్తుల తోనే గెలిసాడు రావణుడిని ఎదిరించి. పొత్తులు లేకుండా ఏ యుద్ధము గెలవలా, ఇది చరిత్ర. జగ్గడు ఒక్కడే హీరో అనుకుంటే, జీరోగా_ మిగిలిపోతాడు.

    3. మునిగిపోయే పార్టీ అని 2019-24 ప్రచారం చేసి చేసి .. ఇప్పుడు మన పార్టీ మునిగి కూర్చుంది అన్న .. వాళ్ళ మనన వాళ్ళను వొదిలేసి ఉంటె మునిగే వారే .. అసెంబ్లీ లో అవమానించి, పెళ్లిళ్లు అని హేళన చేసి, వాళ్ళు కలిసేలా చేసి, మన కొంప మీదకి తెచ్చుకున్నాము .. ఇంకా అదే ప్రచారం, అదే ఎజెండా, పనిచేయని ఫార్ములా ..

Comments are closed.