టీడీపీలో ఆయన దళిత నాయకుడు. నిత్యం వైసీపీ ప్రభుత్వాన్ని తిడుతూ వుంటారు. అయినా ఇంత వరకూ ఆయనకు చెప్పుకోతగిన పదవిని చంద్రబాబు ఇవ్వలేదు. కరివేపాకులా వాడుకుంటుంటారు. చేతికి మైక్, ఏం మాట్లాడినా ప్రచారం కల్పించడానికి మీడియాను ఇవ్వడమే మహాభాగ్యంగా ఆయన భావిస్తున్నట్టున్నారు. రాజకీయాల్లో కనీస హూందాతనాన్ని ప్రదర్శించకపోవడం వల్లే కాబోలు, ఆయన చివరికి బపూన్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో బాబు పాలనలో రాజ్యసభకు ఎంపిక చేశారని, నామినేషన్లు వేయడానికి సగం దూరం వెళ్లిన తర్వాత… టీడీపీ పెద్దలు చావు కబురు చల్లగా చెప్పారు. “సారీ, చివరి క్షణంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాల్సి వచ్చింది. మరోసారి మిమ్మల్ని అదృష్టం వరించాలని ఆశిద్దాం” అని సెల్ఫోన్లో వచ్చిన సందేశంతో ఆయన షాక్కు గురయ్యారు.
తాజాగా తగదునమ్మా అంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని తప్పు పట్టబోయి, సదరు బపూన్ అభాసుపాలయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగనన్నకు చెబుదామనే పేరుతో వైసీపీ ప్రభుత్వం నూతన కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన మరుక్షణమే, తానున్నానంటూ టీడీపీ నాయకుడు మీడియా ముందుకొచ్చారు. టోల్ ఫ్రీ నంబర్ 1902కు ఫోన్ చేసి, సమస్య కాకుండా ఇతరేతర అంశాల్ని మాట్లాడారు. అటు వైపు నుంచి అంతే మర్యాదగా సమాధానం ఇచ్చి, సదరు నాయకుడిని ఆశను నీరుగార్చారు.
టీడీపీ నాయకుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఏ పనీ లేని వెధవల కోసం కాదంటూ వైసీపీ సోషల్ మీడియా ఘాటుగా చీవాట్లు పెట్టడం గమనార్హం. మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండడం వల్లే చంద్రబాబు కూడా ఏ పదవీ ఇవ్వకుండా వాడుకుంటున్నాడని ట్రోల్ చేస్తున్నారు.