నిజ‌మా…వంగ‌ల‌పూడి అనితది అలాంటి క్యారెక్ట‌రా?

తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత నిత్యం నీతి వాక్యాలు చెబుతుంటారు. స‌మాజ శ్రేయ‌స్సు గురించి సూక్తులు వ‌ల్లించే అనిత వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా చాలా ప‌ద్ధ‌తిగా వుంటార‌ని అనుకోవ‌డం స‌హ‌జం. కానీ…

తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత నిత్యం నీతి వాక్యాలు చెబుతుంటారు. స‌మాజ శ్రేయ‌స్సు గురించి సూక్తులు వ‌ల్లించే అనిత వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా చాలా ప‌ద్ధ‌తిగా వుంటార‌ని అనుకోవ‌డం స‌హ‌జం. కానీ ఆమె డ‌బ్బు మ‌నిష‌ని, ఆమె అమ్మ‌కాల గురించి సొంత పార్టీ నేత‌లు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ విమ‌ర్శించారు. వారి ఆరోప‌ణ‌లు విన్న వారెవ‌రైనా… నిజ‌మా, అనిత క్యారెక్ట‌ర్ ఇదా అని టీడీపీ నాయ‌కులే ముక్కున వేలేసుకుంటున్న ప‌రిస్థితి.

అనిత గురించి అధికార పార్టీ నేత‌ల‌కు ఎలాగూ మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే రాజ‌కీయ గుర్తింపు కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి గురించి కూడా అనిత నోరు పారేసుకోవ‌డం గురించి తెలిసిందే. ఉమ్మ‌డి విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నుంచి ఆమె రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆమె భావిస్తున్నారు.

2014లో మొద‌టిసారిగా ఆమె అక్క‌డి నుంచే గెలుపొందారు. ఐదేళ్లు తిరిగే స‌రికి సొంత పార్టీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు పాయ‌క‌రావుపేట కాకుండా మ‌రో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కేటాయించారు. తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరులో ప్ర‌స్తుత హోంశాఖ మంత్రి వ‌నిత చేతిలో అనిత ఓడిపోయారు. దీంతో అనిత మ‌ళ్లీ త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావుపేట‌కు మ‌కాం మార్చారు.

అనిత‌పై అక్క‌డి టీడీపీలో ఆగ్ర‌హం ఇంకా చ‌ల్లార‌లేద‌ని తాజాగా ఆ పార్టీ నాయ‌కుల తీవ్ర విమ‌ర్శ‌లే చెబుతున్నాయి. పాయ‌క‌రావుపేట మండ‌లంలోని వివిధ గ్రామాల మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు స‌మావేశ‌మై అనిత‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. టీడీపీ హ‌యాంలో ఇళ్ల ల‌బ్ధిదారులకు సంబంధించి ఒక్కొక్క‌రి నుంచి రూ.30 వేలు చొప్పున అనిత వ‌సూలు చేశార‌ని ఆరోపించారు. అలాగే పింఛ‌న్ కావాలంటే రూ.5 వేలు చొప్పున ల‌బ్ధిదారులు క‌ప్పం క‌ట్టాల్సిందే అని ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంతేకాదు, జెడ్పీ కోఆప్ష‌న్ స‌భ్యత్వాన్ని కూడా ఆమె అమ్ముకున్నార‌ని సొంత పార్టీ నేత‌లు అనిత‌పై ఆరోపించ‌డం టీడీపీలో సెగ‌లు రేపుతోంది. ఇలా ప్ర‌తిదానికి అనిత డ‌బ్బు తీసుకోవ‌డం వ‌ల్లే పాయ‌క‌రావుపేట‌లో టీడీపీ నాశ‌న‌మైంద‌నేది వారి ఆరోప‌ణ‌.

మ‌రోసారి అనిత‌కు టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామ‌ని వారు హెచ్చ‌రించారు. అనిత‌పై అన‌ధికార మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పాయ‌క‌రావుపేట నాయ‌కులు కూడా ఆ మ‌ధ్య ఇలాంటి ఆరోప‌ణ‌లే చేశారు. విద్యావంతురాలైన అనిత ఉపాధ్యాయ వృత్తిని వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. రాజ‌కీయాల్లో బ్యూటీ లేడీగా ఆమె గుర్తింపు పొందారు. కానీ ఎందుక‌నో ఆమెపై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం, అభిమానించే వాళ్లు కొట్టి పారేస్తున్నా, నిప్పులేనిదే పొగ రాదు క‌దా అని అనుమానించే ప‌రిస్థితి. త‌న అందంతో, అభిన‌యం, తియ్య‌టి మాట‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అనిత‌, అంత‌కు మించి అవినీతి ఆరోప‌ణ‌ల‌తో అభాసుపాలు కావ‌డం గ‌మ‌నార్హం.