కేబినెట్ నిర్ణ‌యాల‌పై కేసులా.. చంద్ర‌వాద‌న‌!

'కేబినెట్ లో కూర్చున్న వాళ్లెవ్వ‌రూ నోట్లో వేల్లేసుకున్న వారు కాదు..' ఇదీ మాజీ మంత్రి అచ్చెన్న స్పంద‌న‌! కేబినెట్ నిర్ణ‌యాల‌పై క్రిమిన‌ల్ కేసులు ఎలా పెడ‌తారు.. అంటూ కోర్టులో ప్ర‌సంగించార‌ట చంద్ర‌బాబు నాయుడు!  Advertisement…

'కేబినెట్ లో కూర్చున్న వాళ్లెవ్వ‌రూ నోట్లో వేల్లేసుకున్న వారు కాదు..' ఇదీ మాజీ మంత్రి అచ్చెన్న స్పంద‌న‌! కేబినెట్ నిర్ణ‌యాల‌పై క్రిమిన‌ల్ కేసులు ఎలా పెడ‌తారు.. అంటూ కోర్టులో ప్ర‌సంగించార‌ట చంద్ర‌బాబు నాయుడు! 

అర్రెర్రె.. ఎంత ప‌నైపోయింది! జ‌గ‌న్ ఇంత ప‌ని చేశాడా! కేబినెట్ నిర్ణ‌యాల పై కేసులు పెట్ట‌డానికి వీల్లేద‌ట‌! ఈ మాత్రం జ‌గ‌న్ కు తెలియ‌క‌పోయిందే! కేబినెట్ నిర్ణ‌యాల‌పై కేసులు పెట్ట‌డానికి వీల్లేదనే విష‌యం చంద్ర‌బాబుకు ఇప్పుడే తెలిసిందా?  లేక ప‌న్నెండేళ్ల కింద‌టే తెలుసా? 

ఒక్క సారి పుష్క‌ర కాలం వెన‌క్కు వెళితే.. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణించాకా జ‌గ‌న్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ పెట్టిన కేసులు ఎలాంటివ‌బ్బా?  నాటి  క్విడ్ ప్రోకో.. కేసుల వ్య‌వ‌హ‌రాన్ని ప‌రిశీలిస్తే.. కేబినెట్ నిర్ణ‌యాలే మీదే క‌దా జ‌గన్ మీద కేసుల పెట్టారు!

అప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై జ‌గ‌న్ మీద కేసులు పెట్టారు! అప్పుడు జ‌గ‌న్ ఏపీ కేబినెట్ లో మంత్రి కాదు, క‌నీసం ఎమ్మెల్యే కాదు! ఏపీ కేబినెట్ వివిధ కంపెనీల కు భూములు, నీటిని కేటాయిస్తూ నిర్ణ‌యాలు తీసుకుంద‌ని, అలాంటి కంపెనీలు జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టాయంటూ జ‌గ‌న్ కేసు లు న‌మోదు చేశారు. ఈ కేసుల్లో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయ్యి, ఆది నుంచి ప్ర‌ధాన పాత్ర పోషించింది!

మ‌రి ఇప్పుడేమో కేబినెట్ నిర్ణ‌యాల‌పై కేసులు కుద‌ర‌వ‌ని స్వ‌యంగా కోర్టులో వాదించార‌ట చంద్ర‌బాబు నాయుడు! జ‌గ‌న్ అవినీతి అంటూ తెగ మాట్లాడిన అచ్చెన్నాయుడు కేబినెట్లో కూర్చున్న వారెవ‌రూ నోట్లో వేల్లేసుకున్నారు వారు కాదంటూ ఉటంకిస్తున్నారు! 

మ‌రి త‌మ వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి.. అది కేబినెట్ నిర్ణ‌యం, పుష్క‌ర‌కాలంగా మాత్రం అప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ జైలు పాలైతే అది అవినీతి! వైఎస్ కేబినెట్ లో జ‌గ‌న్ మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు! అలాగే త‌న కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన వారు లాభాల్లో వాటా తీసుకున్నార‌ని కూడా ఆధారాల‌ను ఇచ్చారు. అలాగే ప్ర‌భుత్వం నుంచి నాటి కేబినెట్ నిర్ణ‌యాల ద్వారా త‌మ‌కు క‌లిగిన ల‌బ్ధితో పోలిస్తే తాము జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబ‌డులు అనేక రెట్లు ఎక్కువ‌ని! 

తాము చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్యాపారం చేశాం త‌ప్ప‌.. ఆ నిర్ణ‌యాల‌కూ త‌మ పెట్టుబ‌డుల‌కూ సంబంధం లేదు మొర్రో అని అనేక కంపెనీలు కోర్టుల వ‌ద్ద వాపోయాయి. కోటి రూపాయ‌ల ల‌బ్ధికి ప‌ది కోట్ల రూపాయ‌ల లంచం ఎవ‌రైనా ఇస్తారా? అంటూ ఆ కంపెనీలు విశ‌దీక‌రించాయి. మ‌రి అప్పుడేమో తెలుగుదేశం పార్టీ గ‌గ్గోలు పెట్టింది, ఇప్ప‌టికీ ఆ వ్య‌వ‌హారం వ‌స్తే అదే గ‌గ్గోలు కొన‌సాగుతుంది. ఇప్పుడు మాత్రం కేబినెట్ నిర్ణ‌యాల‌పైనే కేసులు పెడ‌తారా అంటూ గ‌గ్గోలు పెడుతోంది!