24 నుంచి రాజకీయ యవనికపై చంద్రబాబు కనిపించరు!

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోసారి స్పందించారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 =…

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోసారి స్పందించారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు'. అంటూ ట్వీట్ చేశారు.

విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్‌తో.. చంద్ర‌బాబును వెంటాడుతున్న 23 నంబ‌ర్‌ను గుర్తుకు తెస్తునే 2024 నుండి రాజకీయ య‌వినిక‌పై ఇక క‌నపించ‌రు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే గ‌తంలో త‌న మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయ‌న్ను ఏడిపించి.. మ‌నోవేద‌న‌కు గురి చేసిన విష‌యాన్ని కూడా గుర్తుకు తెచ్చారు.

కాగా చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలోకి లాక్కోని.. ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ప్ప‌టి నుండి 23 నెంబ‌ర్ చంద్ర‌బాబును వెంటాడుతోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి 23 సీట్లు రాగా, చంద్ర‌బాబు అరెస్ట్ అయిన తేది 9-9-23. ఆ అంకెలను కలిపితే మొత్తం 23 రావ‌డం విశేషం. అలాగే రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించగా, వాటిని కూడితే 23 వస్తుంది. దీంతో ఆయనను 23 నెంబర్ వీడడం లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

నిన్న కూడా చంద్ర‌బాబు అరెస్ట్‌పై విజ‌య‌సాయి రెడ్డి స్పందిస్తూ.. కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చు కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. జీవితాంతం జైల్ లో నే ఉండాల్సినన్ని నేరాలతోకూడిన స్కాం లు చేశారు చంద్రబాబు అండ్ కో. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ కి కూడా చట్టం వర్తిస్తుంది. ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైంది. అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా రామోజీ రావుకు వార్నింగ్ ఇచ్చారు.