చంద్ర‌బాబు.. వేర్ ఈజ్ ద‌ట్ విక్ట‌రీ సింబ‌ల్!

చంద్ర‌బాబు అంటే.. ద‌శాబ్దాలుగా టీవీల్లో చూసిన వారికి .. రిజిస్ట‌ర్ అయ్యే అంశం..ఆయ‌న విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ, చేతి వేళ్ల‌ను అలా ఆడించ‌డం! తెలుగు రాజ‌కీయాల్లో ఆ రెండు వేళ్లు ఆడించ‌డం అంటే అది…

చంద్ర‌బాబు అంటే.. ద‌శాబ్దాలుగా టీవీల్లో చూసిన వారికి .. రిజిస్ట‌ర్ అయ్యే అంశం..ఆయ‌న విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ, చేతి వేళ్ల‌ను అలా ఆడించ‌డం! తెలుగు రాజ‌కీయాల్లో ఆ రెండు వేళ్లు ఆడించ‌డం అంటే అది చంద్ర‌బాబు మార్కు సిగ్నేచ‌ర్! 

ఏ స‌భ‌కు హాజ‌రైనా, ప్ర‌చారంలో కానీ, స‌మావేశాల స‌మ‌యంలో కానీ, ఆఖ‌రికి నిరాహార దీక్ష‌లు, ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా చంద్ర‌బాబు నాయుడు విక్ట‌రీ సింబ‌ల్ ను చూపుతుంటారు! ఆ మ‌ధ్య ఏదో దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ ఎవ‌రినో ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి అక్క‌డ కూడా విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ చేతి వేళ్ల‌ను గాలిలో ఆడించి విమ‌ర్శ‌ల పాల‌య్యాడాయ‌న‌!

మ‌రి కెమెరాలు క‌నిపిస్తే చాలు, న‌లుగురు ముందు క‌నిపిస్తే చాలు.. విక్ట‌రీ సింబ‌ల్ ను ఆడించే ఆయ‌న మొహాన్ని అరెస్టు చేసిన త‌ర్వాత చూస్తున్న‌ప్పుడు పాలిపోయి ఉండ‌ట‌మే కాదు, త‌న మార్కు విక్ట‌రీ మార్కును ఆయ‌న చూప‌డం లేదు!

నంద్యాల్లో అరెస్టు చేసిన త‌ర్వాత కానీ, ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కానీ, మీడియా, తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు క‌నిపించిన‌ప్పుడు కానీ.. చంద్ర‌బాబు విక్ట‌రీ సింబ‌ల్ చూపే సాహ‌సం చేయ‌లేదు!

మ‌రి త‌ను నిర్దోషిని అని, క‌క్ష సాధింపు అని అంటున్న చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి స‌మ‌యంలో పూర్తి విశ్వాసంతో క‌నిపించాలి!  త‌నను అక్రమంగా అరెస్టు చేసి జ‌గ‌న్ జైలుకు పంపుతున్నాడ‌ని వాపోతున్న‌ప్పుడు, తను వీటిని ఎదుర్కొని ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌నే ధీమాను వ్య‌క్తం చేయాలి! మ‌రి ఆ ధీమాను త‌న మార్కు స్టైల్లో విక్ట‌రీ సింబ‌ల్ చూపించి ఉంటే.. ప‌చ్చ శ్రేణుల్లో కూడా గ‌ట్టి విశ్వాసం ఏర్ప‌డేది! చంద్ర‌బాబు త‌ప్పు చేయ‌లేదు, అందుకు ఆయ‌న సిగ్నేచ‌ర్ మార్కు అభివాద‌మే సాక్ష్యం అని వారి మ‌న‌సులు కుదుట ప‌డేవి!

ఆఖ‌రికి ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు వెళ్లి కూడా విక్ట‌రీ సింబ‌ల్ చూపించే చంద్ర‌బాబు త‌ను అరెస్టు అయిన త‌ర్వాత కానీ, త‌ను జైలుకు వెళుతున్న‌ప్పుడు కానీ.. పొర‌పాటున కూడా చేయి లేప‌లేదు! చంద్ర‌బాబులో ఉన్న జైలు భ‌యం, ఈ కేసులో త‌న ప్ర‌మేయం ఆయ‌న‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసి.. ఆఖ‌రికి త‌న మార్కు అభివాదం కూడా చేసే పరిస్థితి లేకుండా చేసిన‌ట్టుగా ఉంది.