రాజకీయ వ్యవస్థ మార్చడమే పవన్ లక్ష్యమని , అందుకే పవన్ రాష్ట్రయాత్ర అని జనసేన చెబుతోంది. రాజకీయ వ్యవస్థని మార్చడానికి ముందు పవన్ కొన్ని విషయాలు స్పష్టం చేయాలి. ఇపుడున్న వ్యవస్థ బాలేదు. అందరికీ సమాన అవకాశాలు లేవు. రకరకాల జాడ్యాలతో వుందని తెలుసు. నిజం కూడా ఇదే. అయితే పవన్ ఏం మారుస్తాడు? గత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయినా పవన్ దగ్గర సమాధానం లేని కొన్ని ప్రశ్నలు.
1) డబ్బు లేని వాళ్లకి. నిజాయితీపరులైన సామాన్యులకి టికెట్లు ఇస్తారా?
2) కులాన్ని ప్రాధాన్యతగా తీసుకోకుండా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారా?
3) ఓటర్లకి డబ్బులు ఇస్తారా లేదా? (ఇస్తామని ఎవరూ నేరుగా చెప్పరు. అయినా పంపకాలు బహిరంగ రహస్యం)
4) జనరల్ సీట్‌లో ఎస్సీ, ఎస్టీలను నిలబెడతారా?
5) గెలుపు కోసం ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తారా? చేయరా?
6) పార్టీ పెట్టి 8 ఏళ్లైంది. క్రియాశీలకంగా పనిచేస్తున్న నలుగురు మహిళల పేర్లు చెబుతారా?
7) ఐదేళ్ల బాబు పాలనలో ప్రజల కష్టాల కోసం రోడ్డు మీదకి ఎందుకు రాలేదు?
8) షూటింగ్ లంచ్ బ్రేక్‌లో జూనియర్ ఆర్టిస్టులతో కలిసి ఎన్నిసార్లు భోంచేశారు?
9) తడుముకోకుండా 175 నియోజకవర్గాల పేర్లు చెప్పండి
10) రాసిచ్చిన ఉపన్యాసం కాకుండా, సొంతంగా మాట్లాడిన రోజులున్నాయా?
యాత్ర పూర్తయిన తర్వాతైనా సమాధానాలు చెప్పండి.
జీఆర్ మహర్షి