టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ ప్రోగ్రామ్‌గా మార్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించిన సందర్భంలో స్థానిక అరకు ఎంపీ అయిన తనను పిలవకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేసిందని అరుకు వైసీపీ ఎంపీ డాక్టర్ తనూజ రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం అన్నది ఈ కూటమి ప్రభుత్వానికి తెలియదా? అని ఆమె ప్రశ్నించారు.

అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్‌ను ఘనంగా నిర్వహించారు, కానీ అరకు ఎంపీని విస్మరించి అవమానించారు అని ఆమె మండిపడ్డారు. అరకు ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని పిలవకపోవడం ఏ విధమైన విధానం? అని ఆమె నిలదీశారు. అరకు కాఫీ పండిస్తున్న పది మంది రైతులను పార్లమెంట్‌కు తీసుకువచ్చి, వారి గురించి వివరించి ఉంటే ఎంత బాగుండేది అని అన్నారు.

అరకు కాఫీ వెనక రైతులు ఎంతో కష్టపడుతున్నారు. వారికి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. కేవలం అరకు కాఫీ మాత్రమే కాదు, అనేక పంటలకు ప్రసిద్ధి. అలాంటి విషయాలు ప్రస్తావించాలనిపించలేదా? అని ఆమె ప్రశ్నించారు.

అరకుకు ప్రాముఖ్యతను ఇచ్చే ‘ధింసా నృత్యం’ ఉంది. దాని గురించి కూడా చెప్పాలనిపించలేదా? అని ఆమె కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకు ఎంపీనే పట్టించుకోలేని వారు గిరిజనుల గురించి ఏమి ఆలోచిస్తారని తనూజ రాణి మండిపడ్డారు. అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్‌లో తనకు జరిగిన ఈ అవమానానికి సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు మీద ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తాని ఆమె స్పష్టం చేశారు.

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ ప్రోగ్రామ్‌గా మార్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఒక గిరిజన ఎంపీ, విద్యాధికురాలి విషయంలోనే ఈ వివక్ష చూపిస్తే, ఇక గిరిజనులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుంది? అని అనుకోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు.

10 Replies to “టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!”

  1. అక్కడికి అక్కే అరకు కాఫీ పండించినట్లు, 100% పేటెంట్ ఆవిడకే అన్నట్లు ఉన్నాయి మాటలు!! అక్కడ కాఫీ important MP కాదు!! ప్రోటోకాల్ kicks in when the inauguration is in the constituency not elsewhere!!

  2. సరే అక్కా, GA వార్తలు నువ్వు కూడా సదువు తావేటి?వాడి రాతలు నమ్మేసి ఒహ్హ్ వచ్చేశావ్:)

Comments are closed.