అచ్యుతాపురం సెజ్ లో మరణ మృదంగం

ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో దారుణం జరిగింది. సెజ్ లో రియాక్టర్ పేలడంతో పదహారు మంది దాకా కార్మికులు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.…

ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో దారుణం జరిగింది. సెజ్ లో రియాక్టర్ పేలడంతో పదహారు మంది దాకా కార్మికులు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలిన సౌండ్ కి భవనం పై అంతస్తు బీటలు వారి కుప్ప కూలింది దాంతో ఆ శిధిలాల మధ్యన చిక్కుకుని మరింత మంది కార్మికులు మృతి చెందారు.

ఈ దారుణ ఘటనలో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సరైన భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ ఘటనలో అమాయక కార్మికులు బలి అయ్యారు.

రియాక్టర్ పేలిన భారీ శబ్దానికి అచ్యుతాపురం సమీప ప్రాంతాల ప్రజానీకం జడుసుకున్నారు. అగ్ని మాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. కానీ ప్రమాద తీవ్రత మాత్రం అత్యధికంగా ఉండడంతో ఈ సెజ్ లో మరణ మృదంగమే మోగిందని చెప్పాలి. ప్రమాదం జరిగే సమయంలోనే మూడు వందల మంది దాకా కార్మికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు ప్రాణాలతో పోరాటమే చేస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

అచ్యుతాపురం ఘటన మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రబాబు గురువారం అచ్యుతాపురానికి వస్తున్నారు. జగన్ శుక్రవారం వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనలో ఒకటిగా అచ్యుతాపురం సెజ్ ఘటన ఉందని అంటున్నారు.

18 Replies to “అచ్యుతాపురం సెజ్ లో మరణ మృదంగం”

  1. ఫార్మా సెజ్ పేరు చెప్పి , కాకినాడ నుండి వైజాగ్ వరకు విచ్చలవిడిగా కంపెనీ లు పెట్టేసారు . ప్రతీ రాజకీయ నాయకుడికి ఒక ఫార్మా కంపెనీ ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు . అవి ఏ విధమైన రూల్స్ పాటించవు . వేస్ట్ ని భూమి లోకి తోసేయడం , కొన్ని అయితే కనీసం చేతి కి గ్లోవ్స్ కూడా ఇవ్వవు అంటే మీకు కోపం వస్తుంది . అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు .

    ఇంకో 50 సంవత్సరాలలో , ఆ ఊళ్లు అన్ని విషపూరితం అయిపోతాయి .

    గమనిస్తే , ఈ కంపెనీ ఓనర్ పేరు ఎక్కడ రాయరు . చూస్తూ ఉండండి ఇదొక్కటే కాదు , భవిష్యతు లో ఇంకా జరుగుతాయి .

  2. 2019 when similar incident happened Government gave 1cr compensation. This time Kootami will give 2cr and make sure that no one remembers the 2019 compensation any longer. Just see, Kootami will do more good.

  3. కాలం చెల్లిన పరికరాలు…..గాలికొదిలేసిన నిబంధనలు …..కాలుష్యం ప్రజోపయోగం పట్టని వైఖరి …ఉద్యోగులతో గొడ్డు చాకిరి…అత్తెసరు జీతాల తో శ్రమ దోపిడీ ..ఇది మన రెండు తెలుగు రాష్ట్రము లో ఉన్న మెజారిటీ ఫార్మా కంపెనీ ల తీరు….ఇలాంటి మరణాలు ముందు ముందు కూడా ఉంటాయి అనేది ఒక చేదు నిజం….ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న ఇది మారదు అనేది ఇంకో కఠినమైన నిజం

    1. ఎవరు వచ్చినా ప్రయోజనం శూన్యం. ఇది మాత్రం ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా… కఠోరనిజం… నగ్న సత్యం.

  4. జగన్ అన్నా ఒకటికాదు రెండు కాదు బోలెడు శ వా లు దొరికాయి.. వచ్చేయ్యు అన్న వచ్చి రాజకీయం మొదలెట్టు

Comments are closed.