అంద‌రూ క‌లిసి….తిరుమ‌ల ప్ర‌సాదాన్ని?

టీటీడీ ల‌డ్డూ ప్ర‌సాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిన‌ట్టు బాబుతో పాటు టీడీపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో…

టీటీడీ ల‌డ్డూ ప్ర‌సాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిన‌ట్టు బాబుతో పాటు టీడీపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డించాల్సింది టీటీడీ ఈవో లేదా జేఈవో. వాళ్లు మాత్రం మౌనంగా వుంటూ, టీడీపీ విమ‌ర్శ‌ల్ని రాజ‌కీయంగా చూడాలా? లేక అధికార పార్టీ కావ‌డంతో నిజ‌మ‌ని న‌మ్మాలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

మ‌రీ ముఖ్యంగా ఏ ఆధారాలతో అయితే క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు మొద‌లుకుని, టీడీపీ నేత‌లంతా తీవ్ర ఆరోప‌ణ‌ల్ని గుప్పిస్తున్నారో, ఆ రిపోర్ట్ కేవ‌లం అనుమానం మాత్ర‌మే వ్య‌క్తం చేస్తోంద‌న‌డం విడ్డూరంగా వుంది. అధికారికంగా నిర్ధార‌ణ లేకుండా కేవ‌లం అనుమానంతో ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు ప‌ర‌మ ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ప్ర‌సాదంపై నిందారోప‌ణ‌లు చేయ‌డంపై భ‌క్తులు అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

టీడీపీ అనుకూల ప‌త్రిక గుజ‌రాత్‌కు చెందిన స‌ద‌రు నివేదిక‌పై ఏం రాసిందో చూద్దాం.

“వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హ‌యాంలో టీటీడీ మ‌హాప్ర‌సాదం ల‌డ్డూల త‌యారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి క‌ల‌గ‌లిపి ఉందొచ్చ‌నే అనుమానాన్ని గుజ‌రాత్‌కు చెందిన నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్య‌క్తం చేసిన‌ట్టు టీడీపీ తెలిపింది”

గుజ‌రాత్‌లోని నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు అనుమానాల్ని వ్య‌క్తం చేస్తోంద‌ని టీడీపీ చెబుతోంద‌ని అంటూనే, ప్ర‌సాదంపై నిందారోప‌ణ‌లు ఎలా చేస్తుంద‌నేదే ప్ర‌శ్న‌. ఇక్క‌డ టీడీపీ నేత‌లు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే … రాజ‌కీయంగా వైసీపీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే వ్యూహంలో భాగంగానే తిరుమ‌ల ప్ర‌సాదాన్ని తెర‌పైకి తెచ్చి వుండొచ్చు. కానీ తిరుమ‌ల ప్ర‌సాదంపై అనుమానాల్ని సృష్టిస్తున్నామ‌నే భ‌యంక‌ర నిజాన్ని ఎందుకు గుర్తించ‌డం లేదో అర్థం కావ‌డం లేదు. రాజ‌కీయ నాయ‌కులంతా క‌లిసి తిరుమ‌ల ప్ర‌సాదం ప‌విత్ర‌త‌ను, విలువ‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నార‌ని భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

31 Replies to “అంద‌రూ క‌లిసి….తిరుమ‌ల ప్ర‌సాదాన్ని?”

    1. ఒకటి బెనిఫిట్ of డౌట్ ఏమిటంటే, బజార్ లో కల్తీ నెయ్యి వస్తుంది, ఇలాంటి తరహా నెయ్యి కొన్న అనుభవం నాకు ఉంది

      1. ఎప్పుడో టీవీ లో న్యూస్ చూసాను, జంతువుల కొవ్వు తో నెయ్యి కల్తీ చేసి అమ్ముతున్నారు అని, నా అనుభవం ఏమిటంటే ఈ రకం నెయ్యి స్వీట్ కోసం స్టవ్ మీద పెట్టినపుడు నాన్ వెజ్ మీట్ స్టవ్ మీద ఉండేటప్పటి వాసన వస్తుంది. అప్పుడప్పుడు చుట్టుపక్కల నుంచి ఇలాంటి వాసన రావడం గమనిస్తూ ఉంటాను.

    2. ఒక ముఖ్యమంత్రి కి ఇంత కంటే మంచి అవకాశం రాదు

      ఇంటర్నల్ ఎంక్వయిరీ వేసి responsible persons ni బొక్కలో వేసి with ప్రూఫ్ తో మీడియా ముందు చెప్పాలి.

      సున్నితమయిన అంశాలు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాలి

      1. బాధ్యులు అయిన వాళ్ళలో ఒకరిద్దరి మీద ఇప్పటి అధికార వర్గాల కి కనుక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఓ నాలుగు రోజుల తర్వాత సద్దుమణిగి పోతుంది, నేను అనుకునేది ఏమీ తేల్చరు అని, ఎందుకంటే ఎప్పుడూ దేని మీద చర్యలు తీసుకున్న దాఖలా ఇంతవరకు చూడలేదు.

  1.  లాబ్ రిపొర్ట్ వచ్చినా నేయ్యి మీద నీచ, నిక్రుష్ఠ, సమర్దింపులు!

    దమ్ముంటె ఆదారాలు చూపించు అని తొడ కొట్టిన YV సుబ్బడు, ఇప్పుడు ఈ నయ్యి గురించి ఎవరూ మాట్లాడకూడదు, రాయకూడదు అని కొర్ట్ కి గ్యాగ్ ఆర్దెర్ కొసం పరిగెత్తాడు!

    1. ఒక ముఖ్యమంత్రి కి ఇంత కంటే మంచి అవకాశం రాదు

      ఇంటర్నల్ ఎంక్వయిరీ వేసి with ప్రూఫ్ తో మీడియా ముందు చెప్పాలి.

      సున్నితమయిన అంశాలు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాలి

  2. Political crooks will stoop to whatever level and they have no sentiments all they want is political milage and benifit. This is best example. Govt. must immediately order a Sitting Judge enquiry immediately with a timebound of max two weeks if they really want to respect Hindus sentiment.

  3. ఒరేయ్ గ్రేట్ ఆంధ్రా.. ఆ రిపోర్టుల్లో పర్శంటేజ్ తో సహా వివరంగా చెప్పే .. నువ్వు చూడా అనుమానం ఉందట అని రాశావు చూడు. అది మీరు. ఇలాంటి విషయాలకు కూడా మీ జగన్ గారికి సపోర్ట్ చేస్తే పురుగులు పట్టి పోతారు. వాళ్ళు కావాలని చేప నూనే, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, చేప నూనె కలపమని వీరు స్వయంగా చెప్పకపోవచ్చు. కానీ క్వాలిటీ నెయ్యి 1000 రూపాయల వరకూ బయట మార్కెట్లో ఉంటే.. వాళ్ళు 320 కి, 400లకు ఇస్తామంటే అనుమానం రావాలి కదా.. వాళ్ళు టెస్టులు చేయించాలి కదా. అసలు గత రెండు మూడేళ్ళుగా లడ్డు క్వాలిటీ తగ్గిందని భక్తులు మాట్లాడుకుంటున్న మాటలు మీకు వినిపించలేదా..? దేవుడు విషయాల్లో కూడా గుడ్డిగా సపోర్ట్ చేస్తే… ఇక మీ ఖర్మ.

  4. It is heard of that as Amaravati is drowned in floods and failed in implementing super six benefits, TDP just wanted to divert the attention of AP people with false allegations on Tirupathi laddus…

  5. వైసీపీ మద్దతుదారులకు,

    మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

    తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

    హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

    వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

  6. ఒరేయ్ లాస్ట్ 5 ఇయర్స్ లడ్డు టేస్ట్ గురించి తిరిమల వెళ్లి వచ్చిన వాళ్లని అడుగు …ఈ 100 డేస్ లో వెళ్లి వచ్చిన వాళ్లతో అడుగు తెలుస్తుంది …there it’s lot of change in laddu taste positive in last 100 days ..గుడి సెట్లు వేయి పించుకునే వాడికి ఏమీ తెలుస్తుందిలే ఆ వెంకన్న గురించి

Comments are closed.