విశాఖలో టూరిస్టుల వెంట వారుంటారు !

విశాఖ బెస్ట్ టూరిజం స్పాట్. సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖను లైఫ్ లో ఒకసారి అయినా చూడాలని అంతా అనుకుంటారు. విశాఖకు అన్ని సీజన్లలోనూ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. విశాఖకు దేశ విదేశాల…

విశాఖ బెస్ట్ టూరిజం స్పాట్. సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖను లైఫ్ లో ఒకసారి అయినా చూడాలని అంతా అనుకుంటారు. విశాఖకు అన్ని సీజన్లలోనూ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. విశాఖకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారు.

విశాఖకు వచ్చిన వారికి కొత్త వారికి సహాయంగా టూరిజం శాఖ ఇపుడు కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. విశాఖలో టూరిస్ట్ పోలీసింగ్ ని రాష్ట్రంలో ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

టూరిస్టులు విశాఖకు వచ్చినపుడు వారిని ఎవరూ మోసం చేయకుండా టూరిస్ట్ పోలీసింగ్ హెల్ప్ చేస్తుంది. వారు తీసుకునే గెస్ట్ రూమ్స్ నుంచి వారు వినియోగించే కార్లు ఇతర సదుపాయాలు విషయంలో అధిక ధరలకు చెప్పి మోసం చేసేవారు ఉంటారు. ఇలాంటి వారిని ఒక కంట కనిబెడుతూ టూరిస్టులకు సహాయం చేస్తారు. అలాగే వారికి హెల్ప్ ఫుల్ గా ఉంటారు.

ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఏ దేశం పౌరుడు అయినా విశాఖలో టూరిస్ట్ పోలీసింగ్ ద్వారా హెల్ప్ లభిస్తుంది. విశాఖ బీచ్ లో టూరిస్ట్ పోలీసింగ్ కియోస్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ఒక్క టూరిస్టు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విశాఖ నుంచి ఈ టూరిస్ట్ పోలీసింగ్ ప్రయోగాన్ని మొదలెట్టి ఏపీ మొత్తం మీద అమలు చేయడానికి పర్యాటక శాఖ చూస్తోంది.