వారసుడొచ్చాడు..వీరసింహుడు తగ్గాడు

సంక్రాంతి సినిమాల సందడిలో భాగంగా ఈరోజు వారసుడు థియేటర్లలోకి వచ్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు భారీగా స్క్రీన్స్ దక్కాయి. అయితే ఇక్కడ అందరికీ ఓ సందేహం రావొచ్చు. Advertisement ఆల్రెడీ థియేటర్లలో…

సంక్రాంతి సినిమాల సందడిలో భాగంగా ఈరోజు వారసుడు థియేటర్లలోకి వచ్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు భారీగా స్క్రీన్స్ దక్కాయి. అయితే ఇక్కడ అందరికీ ఓ సందేహం రావొచ్చు.

ఆల్రెడీ థియేటర్లలో వీరసింహారెడ్డి ఉంది, మరోవైపు వాల్తేరు వీరయ్య కూడా వచ్చేసింది. బాలకృష్ణ, చిరంజీవి నటించిన రెండు పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పుడు వారసుడు సినిమాకు ఎలా భారీగా స్క్రీన్స్ దొరికాయి. సరిగ్గా ఇక్కడే దిల్ రాజు తన మేజిక్ చూపించాడు.

ఉదాహరణకు కీలకమైన హైదరాబాద్ సెంటర్ విషయానికే వద్దాం. ఈరోజు హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు 369 షోలు ఉన్నాయి. వారసుడు సినిమాకు కూడా ఏమాత్రం తగ్గని విధంగా 328 షోలు పడుతున్నాయి. దీంతో వీరసింహారెడ్డికి షోలు తగ్గిపోయాయి. ఈరోజు హైదరాబాద్ సిటీలో బాలకృష్ణ సినిమాకు కేవలం 262 షోలు మాత్రం దక్కాయి.

ఇది ఒక్క హైదరాబాద్ సిటీకి మాత్రమే పరిమితం కాదు. ఉత్తరాంధ్రలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు నుంచి వీరసింహారెడ్డికి షోలు తగ్గిపోతున్నాయి. ఆ స్థానాల్లో వారసుడు వస్తున్నాడు. ఉత్తరాంధ్రలో దిల్ రాజుకు మంచి హోల్డ్ ఉన్న సంగతి తెలిసిందే.

కాఫీ ఇచ్చాడు.. ప్రమోషన్ ఎగ్గొట్టాడు..

మరోవైపు వారసుడు ప్రచారానికి విజయ్ రాలేదు. తమిళ్ లో ఆల్రెడీ వారిసు రిలీజైంది కాబట్టి, 3 రోజులు గ్యాప్ కూడా దొరికింది కాబట్టి, కచ్చితంగా విజయ్ ను తెలుగు ప్రచారానికి తీసుకొస్తానని దిల్ రాజు ప్రకటించాడు. కానీ అతడు అనుకున్నట్టు జరగలేదు. ఎప్పట్లానే విజయ్, తెలుగు వెర్షన్ ప్రచారాన్ని లైట్ తీసుకున్నాడు.

దీంతో దిల్ రాజుపై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ప్రమోషన్ కోసం అడగడానికి వెళ్తే, మరో కాఫీ కప్పు చేతిలో పెట్టి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడంటూ సోషల్ మీడియాలో జనం కామెంట్ చేస్తున్నారు. మరోవైపు హీరో ప్రచారం చేయని సినిమాకు ప్రేక్షకులు ఎందుకు వెళ్లాలంటూ ఓ చిన్నపాటి బాయ్ కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది.

అయితే ఇది సంక్రాంతి సీజన్. పైగా మెయిన్ సెంటర్లు కొన్ని వారసుడికే దక్కాయి. దీనికితోడు భారీ రిలీజ్ కూడా. దీంతో వారసుడు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.