ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కూడ బాగుకు నోచుకోకుండా ఉన్నాయి. వెనకబడిన జిల్లాలు అంటే ఇవే ముందుగా గుర్తుకు వస్తాయి. శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణ కమిషన్ కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటు…

ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కూడ బాగుకు నోచుకోకుండా ఉన్నాయి. వెనకబడిన జిల్లాలు అంటే ఇవే ముందుగా గుర్తుకు వస్తాయి. శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణ కమిషన్ కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం గురించే ఎక్కువగా ప్రస్తావించింది.

ఆర్ధికంగా ఊతమిచ్చి ఆదుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచెప్పింది. వెనకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే యాభై కోట్ల రూపాయలు కూడా తొలి మూడేళ్ళు ఇచ్చి నిలిపివేశారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజిని అమలు చేయాలని కోరినా పట్టింపు లేదు.

గత పదేళ్ళుగా ఉత్తరాంధ్ర ఇబ్బందుల్లోనే ఉంది. విభజన హామీలు నెరవేర్చడానికి కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయం అని మేధావులు ప్రజా సంఘాల నేతలు భావిస్తున్నారు. ఏపీలోని రాజకీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలోని ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయాలని అంతా కోరుతున్నారు.

ప్రత్యేక హోదా వస్తేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుదని వారు అంటున్నారు. బీజేపీ పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. గుజరాత్ తరహాలో గిఫ్ట్ సిటీని ఉత్తరాంధ్రకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ గిఫ్ట్ సిటీ ప్యాకేజీ కింద 75 వేల కోట్ల రూపాయలు  విశాఖపట్నానికి ఇస్తే తప్పకుండా  ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర సహా ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలన్నా ఏపీకి పరిశ్రమలు రాఅలన్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గత కేంద్ర ప్రభుత్వాలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆల్ ఇండియా ఒబిసి అసోసియేషన్,ఉత్తరాంధ్ర విభాగం ఈ మేరకు డిమాండ్ చేస్తోంది.