వర్ల మాటలకు అసలు ఔచిత్యం ఉండదేమో?

జగన్ పేరు నిందితుల జాబితాలో చేర్చకపోయినప్పటికీ.. ఆయన ఎందుకు వివరణ ఇస్తున్నారు?

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చేసే విమర్శలకు ఒక లాజిక్ అంటూ ఉండదు. చంద్రబాబునాయుడు ప్రత్యేకించి కేబినెట్ సమావేశంలోనే.. మంత్రులందరూ జగన్ మీద విరుచుకుపడడంలో దూకుడు చూపించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసిన తర్వాత.. ఆ పార్టీ నాయకులందరూ పొద్దునలేస్తే అదే పని మీద ఉన్నారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడమే తన పనిగా పెట్టుకున్నారు.

పాపం చాలా మంది తెదేపా నాయకులకు ఒక కష్టం వచ్చి పడుతోంది. ఇతర నాయకులు చల్లిన బురదనే తాము కూడా చల్లితే విలువ ఉండడం లేదు. వేరే నాయకులు చేసిన విమర్శలనే తాము కూడా చేస్తే మీడియాలో ప్రయారిటీ దక్కడం లేదు. అందుకే కాస్త సృజనాత్మకంగా, కొత్తగా జగన్ మీద బురద చల్లడానికి ఎవరి తెలివితేటలు వారు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా తన టేలెంట్ చూపిస్తున్నారు.. గానీ.. అవి లాజిక్ రహిత పసలేని వ్యాఖ్యలుగా తేలిపోతున్నాయి.

ప్రస్తుతం సీజన్ అంతా ‘రప్పా రప్పా’చుట్టూ నడుస్తున్నది గనుక.. పార్టీ నాయకులంతా.. ఆ వ్యాఖ్యలకు ముడిపెట్టి జగన్ ను విమర్శిస్తున్నారు. అయితే వర్ల రామయ్య మాత్రం లిక్కర్ స్కామ్ టాపిక్ తీసుకున్నారు. నిందితులు 40 మంది ఉండగా, ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి విమర్శలు చేయదలచుకున్నారు. ఎలా ముడిపెట్టాలో కూడా ఆయనకు లాజిక్ దొరికినట్టు లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాపం.. ఆయన, ఈ కేసులో జగన్ మౌనాన్ని అర్థాంగీకారంగానే తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.

అసలు ‘అర్థాంగీకారం’ అనే మాటే పెద్ద బూతు అని పెద్దలు అంటూ ఉంటారు. అర్థాంగీకారం అంటే.. దాని భావం.. అర్థ-అనంగీకారం అనే కదా! అని విశ్లేషిస్తుంటారు. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి.. జగన్ పట్టించుకోకుండా ఉంటే కూడా ఈ రకమైన విమర్శ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ, పచ్చమీడియా వారు గానీ ఎలాంటి తప్పుడు ప్రచారాలైనా చేసుకోవచ్చు గాక.. ఆ స్కామ్ తో తనకు సంబంధం లేనప్పుడు తాను ఎందుకు స్పందించాలి? ఎందుకు మాట్లాడాలి? అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ధీమాగా కొనసాగుతున్నారు. అలా కాకుండా.. పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఏ ఒక్కదానికి వివరణ ఇచ్చి ఉన్నా సరే.. వర్ల రామయ్య వంటి తెలుగుదేశం మేధావుల విమర్శలు ఇంకో తీరుగా ఉండేవేమో.

జగన్ పేరు నిందితుల జాబితాలో చేర్చకపోయినప్పటికీ.. ఆయన ఎందుకు వివరణ ఇస్తున్నారు? ఇలా వివరణ ఇస్తున్నారంటే దాని అర్థం.. గుమ్మడికాయల దొంగ అన్నందుకు భుజాలు తడుముకుంటున్నట్టే కదా? అని బహుశా మడత పేచీ పెట్టేవాళ్లేమో అని జనం నవ్వుకుంటున్నారు.

తనకు సంబంధం లేని విషయంలో ఎవరెన్ని అనుకున్నా తనకేంటి అనే ధోరణిలో జగన్ నిర్లిప్తంగా ఉన్నా కూడా ఆయనను రెచ్చగొట్టడానికి వర్ల రామయ్య వంటి వారు చేస్తున్న ప్రయత్నాలు మంచివి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

10 Replies to “వర్ల మాటలకు అసలు ఔచిత్యం ఉండదేమో?”

  1. సంబంధం లేనప్పుడు ఎందుకు స్పందించాలని స్పందించడం లేదు మా అన్నయ్య 

  2. ముఖ్యమంత్రి అమాయకుడు కాబట్టే మిగతా వాళ్ళు చేశారంటున్న పలువురు విశ్లేషకులు 

  3. ఢిల్లీ లో రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మోదీ కి ప్రాబ్లెమ్ లేదు అని అలాగే ఆంధ్ర లో జగన్ ఉన్నంత వరకు కూటమి కి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు అని అంటున్నారు. ఎందుకు అబ్బా?

  4. వాళ్ళు ఎవరో, ఏమేమో చేస్తుంటే మన A1లం0గాగాడు ఏం చేసేవాడు??

    అంటే మావోణ్ణి ఎర్రిబాగులోన్ని చేసి, అంతా ఆ నలుగురే power మొత్తం వాడుకుని పెళ్ళాంతోసహా అధికారం అనుభవించి, 10 రూపాయల మందు 100 రూపాయలకి cashరూపంలో అమ్ముకుని వేల కోట్లు కూడబెట్టి పార్టీ ని పండబెట్టారు అంటావ్??

     

  5. అంటే మావోణ్ణి ఎర్రిబాగులోన్ని చేసి, అంతా ఆ నలుగురే power మొత్తం వాడుకుని పెళ్ళాంతోసహా అధికారం అనుభవించి, 10 రూపాయల మందు 100 రూపాయలకి cashరూపంలో అమ్ముకుని వేల కోట్లు కూడబెట్టి పార్టీ ని పండబెట్టారు అంటావ్??

     

  6. అంటే మావోణ్ణి ఎర్రిబాగులోన్ని చేసి, అంతా ఆ నలుగురే power మొత్తం వాడుకుని పెళ్ళాంతోసహా అధికారం అనుభవించి, 10 రూపాయల మందు 100 రూపాయలకి cashరూపంలో అమ్ముకుని వేలకోట్లు కూడబెట్టి పార్టీని ప0డబెట్టారు అంటావ్??

  7. అంటే మావోణ్ణి ‘ఎర్రిబాగులోన్ని చేసి, అంతా “ఆ నలుగురే” powerమొత్తం ‘వాడుకుని, పెళ్ళాంతోసహా అధికారం అనుభవి0చి, 10రూపాయల మ0దు 100రూపాయలకి cashరూపంలో అమ్ముకుని వే’లకోట్లు కూడబెట్టి పార్టీని ప0డబెట్టారు అంటావ్??

Comments are closed.