నారా లోకేశ్ పెద్ద లక్ష్యాన్నే నెత్తికెత్తుకున్నారు. తన తంటాలేవో పడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తోంది. కొందరికి ఆయన కమెడియన్‌గా, మరికొందరికి భగత్‌సింగ్‌లా కనిపిస్తున్నారు. పానకంలో పుడకలా దర్శకుడు రాంగోపాల్ వర్మ పాదయాత్రలో తరచూ కాలు పెడుతున్నారు. టీడీపీని, లోకేశ్‌ను తన ట్వీట్లతో కవ్విస్తున్నారు. సీఎం జగన్ తన పాదయాత్రను అడ్డుకుంటున్నాడని, ఇలాగే చేస్తే ఇక దండయాత్ర తప్పదని లోకేశ్ తనకు తోచిన ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
లోకేశ్‌కు పాదయాత్ర భారమైందన్న మాట వాస్తవం. దాన్ని ఎలా కొనసాగిస్తారనేది పెద్ద ప్రశ్న. ఇదిలా వుంటే లోకేశ్ చచ్చినట్టు పాదయాత్ర చేసేలా వర్మ కుట్రపన్నారు. లోకేశ్ ఆడుగులు ముందుకు వేయని తప్పనిసరి పరిస్థితులను వర్మ కల్పించారు. లోకేశ్‌పై అభిమానం ప్రదర్శిస్తూ, ఆయన్ను ఇరికించారంటే అతిశయోక్తి కాదు. వర్మ ట్వీట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
“పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేశ్ ఒక టెర్రిఫిక్ ఐడియా చేయచ్ఛు! చెస్ట్ నొప్పో, లిగమెంట్ తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని, పాద యాత్ర ఆపేస్తే తెలుగుదేశం, చంద్రబాబునాయుడి ఆరోగ్యానికి చాలా మందిది. ఇది నా ఉచిత చచ్చు సలహా!” అని వర్మ ట్వీట్ చేశారు.
వర్మ లాంటివాళ్లు ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వకపోతే లోకేశ్, టీడీపీ పెద్దలు ఏదో ఒకటి ఆలోచించేవాళ్లు. వర్మ చెప్పిన రీతిలో కాకపోయినా, జగన్ సర్కార్ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని, జనాలను అడ్డుకుంటోందని తదితర సాకులు చూపి లోకేశ్ పాదయాత్రకు ప్యాకప్ చెప్పే అవకాశాలుండేవి.
ఇప్పుడేమో వర్మ పాదయాత్ర ఆపేందుకు అనారోగ్య కారణాలను చూపాలని సలహా ఇవ్వడంతో ….ఒకవేళ లోకేశ్ ఏదైనా చెప్పి అడుగులు ఆపేసినా, అభాసుపాలు అవుతారు. దీంతో చెస్ట్ నొప్పి వచ్చినా, లిగమెంట్ తెగినా అడుగు వేసి తీరుతానని లోకేశ్ మొండికేయడం ఖాయం. ఇదంతా వర్మ చచ్చు సలహా వల్ల లోకేశ్‌కు ఎదురైనా కష్టమని ఆ వివాదాస్పద దర్శకుడికి ఎవరు చెప్పాలి? ఎలా చెప్పాలి?