వైసీపీకి మైలవరం ఎమ్మెల్యే గుడ్‌బై?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం అసంతృప్తితో ఉండే మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ ఫైనల్‌గా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా దెందులూరులో జ‌రిగే 'సిద్ధం'…

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం అసంతృప్తితో ఉండే మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ ఫైనల్‌గా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా దెందులూరులో జ‌రిగే 'సిద్ధం' సభకు ఆయన దూరంగా ఉండి పార్టీ నుండి బ‌య‌టికి వెళ్లే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే పార్టీ మీద అసంతృప్తి ఉన్న ఆయ‌న తన‌ సామాజిక వ‌ర్గ నేత‌ల ద్వారా టీడీపీలో చేరిక‌పై చంద్ర‌బాబుతో సంప్రదింపులు జరిపిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి కొన్ని రోజుల్లో ఆయ‌న టీడీపీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా ఇప్ప‌టికే మైల‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థిగా వ‌సంత పేరుతో చంద్ర‌బాబు స‌ర్వే నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, మైలవరం సీటు కోసం మంత్రి జోగి రమేష్ పార్టీ అధిష్టానం వ‌ద్ద‌ లాబీయింగ్ చేసినప్పటికీ పార్టీ వ‌సంత‌నే కొన‌సాగించింది. అయినా కూడా ఆయ‌న అయిష్టంగానే పార్టీలో కొన‌సాగుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించారని, సంక్షేమ పథకాలపైనే దృష్టి సారిస్తున్నర‌ని, చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రభుత్వాన్ని గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు.