యుద్ధ సమయంలో ఇలాంటి వీడియోలా?- రేణు దేశాయ్

రెండు దేశాల యుద్ధ వాతావరణం నెలకున్న నేప‌థ్యంలో కొందరు ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన చెందుతున్నారు.

భారత్‌, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త ప‌పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదిక ఒక విజ్ఞప్తి చేశారు. సబ్ స్క్రైబ‌ర్స్‌, వ్యూస్ పెంచుకునేందుకు.. త్రివిధ ద‌ళాల కుటుంబ సభ్యుల్ని బాధించే పోస్టులు పెట్టొద్ద‌నేది ఆమె పోస్టు సారాంశం.

రెండు దేశాల యుద్ధ వాతావరణం నెలకున్న నేప‌థ్యంలో కొందరు ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన చెందుతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఆమె హిత‌బోధ‌తో కూడిన పోస్టు పెట్టడం గమనార్హం.

భార‌త్‌, పాక్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్ర‌మ‌వుతున్న త‌రుణంలో కొంద‌రు వ్యూస్ కోసం ఫ‌న్నీ రీల్స్‌, వీడియోలు సృష్టిస్తున్నార‌ని రేణు వాపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ వినియోగ‌దారుల‌కు ఈ సంద‌ర్భంగా ఒక విష‌యం చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ఇవాళ మ‌నం నిశ్చింత‌గా ఇళ్ల‌లో నిద్ర‌పోతున్నామంటే, అందుకు కార‌ణం దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌కు తెగించి సైన్యం విధులు నిర్వ‌ర్తించ‌డ‌మే అని ఆమె పేర్కొన్నారు.

సైనిక కుటుంబాల బాధ‌ను అంద‌రూ అర్థం చేసుకోవాల‌ని ఆమె కోరారు. మ‌నంద‌రి ప్రార్థ‌న‌లే సైనికులకు కొండంత మ‌నోధైర్య‌మ‌ని రేణుదేశాయ్ పేర్కొన్నారు. ఇలాంటి సున్నిత స‌మ‌యంలో యుద్ధంపై హాస్య‌పూరిత వీడియోలు క్రియేట్ చేయ‌డం మంచిది కాద‌ని ఆమె హిత‌వు చెప్పారు. మ‌న‌మంతా ఐక్యంగా వుంటూ, సైనికుల‌కు, వాళ్ల కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల‌ని రేణుదేశాయ్ విజ్ఞ‌ప్తి చేశారు. యుద్ధ ప‌రిస్థితుల్ని స‌బ్‌స్క్రైబ‌ర్స్‌, వ్యూస్ పెంచుకోవాల‌ని అనుకోవ‌డం స‌రైంది కాద‌ని ఆమె చుర‌క‌లు అంటించారు.

5 Replies to “యుద్ధ సమయంలో ఇలాంటి వీడియోలా?- రేణు దేశాయ్”

Comments are closed.