విజయసాయి స్వాగతంలో కనిపించరేమి?

ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ని ఇటీవల నియమించారు. ఆయన గత నెలలో ఒకసారి విశాఖ వచ్చారు. దీపావళి తరువాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తాను…

ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ని ఇటీవల నియమించారు. ఆయన గత నెలలో ఒకసారి విశాఖ వచ్చారు. దీపావళి తరువాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తాను అని నాడు ప్రకటించారు.

ఇపుడు ఆయన పదవీ బాధ్యతల స్వీకరణకు వచ్చారు. ఆయనకు ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అయితే వారు లో మిస్ అయిన వారి గురించే వైసీపీలో చర్చ సాగుతోంది. గతంలో విజయసాయిరెడ్డి విశాఖ వచ్చినపుడు కూడా వారు కనిపించలేదు.

ఇపుడు కూడా లేరు. దాంతో విజయసాయిరెడ్డి ఇంచార్జిగా వస్తే వారు ఎందుకు కనిపించడం లేదు అని పార్టీవాదులు అంతా తర్కించుకుంటున్నారు.

మాజీ మంత్రి, భీమిలీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వంటి వారు రాలేదు. ఇదే జాబితాలో మరి కొందరు నేతలు ఉన్నారు.

గతంలో అవంతి మంత్రిగా ఉన్నపుడు ఆయన పవర్స్ ని కట్ చేశారని, హవా అంతా విజయసాయిరెడ్డిదే అయిందని ప్రచారంలో ఉంది. దాంతో ఆయనకు విజయసాయిరెడ్డితో గ్యాప్ ఉందని అప్పట్లో అంతా అనుకున్నారు.

విశాఖ దక్షిణం సీటుని టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వాసుపల్లికి కాకుండా వేరే వర్గాన్ని తయారు చేశారని ఆయన దూరం జరిగారు. ఇపుడు విజయసాయిరెడ్డినే దగ్గరుండి మరీ వైసీపీ అధినాయకత్వం పంపించింది. దీంతో ఆయనతో గ్యాప్ ఉన్న లీడర్లు అంతా ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది కూడా డిస్కషన్ గా ఉంది.

అవంతి శ్రీనివాసరావు అయితే ఇటీవల కాలంలో పార్టీ యాక్టివిటీని కొంత వరకూ తగ్గించారు అని ప్రచారంలో ఉంది. వాసుపల్లి ఈ మధ్య విజయనగరం టూర్ కి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టు లో కలసి చర్చించారు. జగన్ ఆయనకు భరోసా ఇచ్చి పని చేసుకోమన్నారని అంటున్నారు.

2 Replies to “విజయసాయి స్వాగతంలో కనిపించరేమి?”

  1. పని పొట్టోనికే లేదాయా… వాని పనినే అవినాష్ గాడు చేస్తున్నాడు… ఇంకా మిగిలిన కాకి ముక్కు గాళ్ళకు ఏం పనో…

Comments are closed.