ట్రంప్ కి కలిసొచ్చిన లేడీ లక్

మెరికాలో మార్కెట్ బాగుంటే ఇండియాలో కూడా బాగుంటుంది అని అనుకునేవాళ్లం కొన్నేళ్ల వరకు. కానీ గత నాలుగేళ్లుగా బాలేదు.

ట్రంప్ గెలిచేసాడు. 47వ అమెరికా అధ్యక్షుడిగా జనవరి నుంచి పాలన మొదలుపెడతాడు. పరిస్థితుల్ని పరిశీలిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. ట్రంప్ కి రెండు సార్లు లేడీ లక్ కలిసివచ్చింది. సాధారణంగా “లేడీ లక్” అనే ప్రయోగాన్ని గోల్డెన్ హ్యాండున్న లేడీ పక్కనుండి, ఆ కారణం వల్ల సక్సెస్ వస్తే వాడతారు. కానీ ఇక్కడ ట్రంప్ కి జరిగింది అది కాదు. ప్రత్యర్ధిగా ఆడవాళ్లు నిలిచి తనకు లక్ గా మారారు. అదేంటో చూద్దాం.

2016 ఎన్నికల్లో ట్రంప్ కి ప్రత్యర్ధిగా నిలబడిన అభ్యర్ధి హిల్లరీ క్లింటన్. ఆమెను సునాయాసంగా ఓడించేసాడు ట్రంప్. మళ్లీ ఈ 2024లో ట్రంప్ కి ప్రత్యర్ధి కమలా హ్యారీస్. మళ్లీ నెగ్గేసాడు. ఎటొచ్చీ మధ్యలో ప్రత్యర్ధిగా జో బైడెన్ ఉన్నప్పుడు మాత్రమే ఓటమి చవిచూసాడు.

దీనికి అందరూ ప్రధానంగా చెప్పే కారణం అధికశాతం అమెరికన్ సిటిజెన్లు ఆడవాళ్లకి ఓట్లేయరని…!

ప్రెసిడెంటుగా ఒక స్త్రీని రానీయరని..!
మేల్ డామినేషన్ ఎక్కువని…!!
లేడీ బాసులు నచ్చరని..!!!

చరిత్ర చూస్తే నిజమే అనిపిస్తుంది. అమెరికా ప్రజాస్వామ్య చరిత్ర మొదలై మూడు శతాబ్దాలు దాటినా నేటికీ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేదు. ఎంతో ప్రొగ్రెసివ్ దేశమని చెప్పుకునే దేశంలో అసలు పరిస్థితి ఇది.

పైకి సమానహక్కుల గురించి మాట్లాడినా మహిళలకి రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వని దేశమది. రాష్ట్ర గర్వర్నర్లుగా పని చేసిన వాళ్ల లెక్క చూసినా కూడా 3 శతాబ్దాల్లో 47 మంది మాత్రమే. ఈ లెక్కన చూస్తే మన దేశమే నయం. మహిళా ప్రధానుల్ని, ప్రెసిడెంటుల్ని, ముఖ్యమంత్రుల్ని, గవర్నర్లని ఎప్పటి నుంచో చూస్తున్నాం.

కనుక ట్రంప్ కి రెండు సార్లూ ప్రత్యర్థులు మహిళలవడం కలిసొచ్చిన అంశం.

దానికి తోడు హిల్లరీ నిలబడినప్పుడు ఆల్రెడీ డెమాక్రాట్ అయిన ఒబామా రెండు దఫాలు ఏకధాటిగా ప్రెసిడెంటుగా చేసేసాడు. కనుక ప్రభుత్వవ్యతిరేకత సహజంగా ఉంటుంది. అది కూడా ట్రంప్ కి కలిసొచ్చింది.

ఈ సారి కూడా అంతే. బైడెన్ పాలన చూసి జనం విసిగెత్తి ఉన్నారు. కనుక అది ట్రంప్ కి కలిసొచ్చి అసలే మహిళా అభ్యర్థిగా ఉన్న కమల మరింత వీక్ అయ్యింది.

ప్రతిసారి కంటే ఈ సారి ఒక రికార్డ్ కూడా నెలకొంది. రిపబ్లికన్స్ ఎప్పుడు గెలిచినా పాపులర్ ఓట్ శాతం ఎక్కువ ఉండేది కాదు. ఈ సారి అది 52% పైకి ఉండడం ప్రో-రిపబ్లికన్ వాతావరణం ఏ రేంజులో ఉందో, జనం ఎంత కసి మీద ఓట్లేసారో అర్ధమవుతుంది.

ఎంత జెండర్ ఇనీక్వాలిటీ ఉన్నా, ఏ జాతి వారైనా అమెరికాలో అధ్యక్ష బరిలో నిలబడి మాసెస్ ని అట్రాక్ట్ చేయాల్సిందే. అలాంటి వాళ్లకే అవకాశముంటుంది. వక్తలు, మాటకారులు అయితే సగం గెలుపు వచ్చేసినట్టే. మిగతావి యాంటి-ఇంకంబెన్సీ వగైరాలు కాస్త కలిసొస్తే చాలు.

భారతీయ మూలాలున్న కమల హ్యారిస్ ఈ సారి మిస్సైనా మరో సారి ఆమెకు అవకాశముంది. ఆమె ఇంప్రూవ్ కావాలి. తనని తాను కొత్తగా, బలంగా ప్రెజెంట్ చేసుకోగలగాలి. అలా ఆమెకు అవకాశమొచ్చినప్పుడు రిపబ్లికన్స్ వైపు నుంచి 99% జేడీ వాన్స్ నిలబడఒచ్చు..లేదా పరిస్థితుల్ని బట్టి వివేక్ రామస్వామికి అయినా అవకాశం రావొచ్చు. అతను నిలబెడితే మాత్రం విజయం ఎర్రజెండా వైపే ఉండొచ్చు. అంతటి వక్త అతను. అయినా సరే ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు భారతీయ మూలాలున్నవారే అయ్యే అవకాశమైతే లేకపోలేదు. భవిష్యత్తులో చూడాలి అటువంటి ఘటన ఉంటుందేమో.

ప్రస్తుతం ట్రంప్ గెలిచాడనగానే టెస్లా షేర్లు పరుగుతీస్తున్నాయి. బిట్ కాయిన్ వేల్యూ పెరిగింది. ఓవరాల్ గా మార్కెట్ పుంజుకుంటుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఏరి పారేసే పని మొదలుపెడితే చట్టబద్ధంగా గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్నవాళ్లకి లైన్ క్లియరయ్యే అవకాశముంది. ఆ రోజు కోసం అమెరికాలో ఉన్న ఎందరో భారతీయులు వేచి చూస్తున్నారు.

ట్రంప్ నెగ్గినందువల్ల ఇండియాకి ఒనగూరే ప్రయోజనమేంటి? నిజానికి అమెరికా రాజకీయాలతో సంబంధం లేకుండా ఎదుగుతోంది ఇండియా. ఇక్కడ ఎకానమీ అంత రోబస్ట్ గా ఉంది. అమెరికాలో మార్కెట్ బాగుంటే ఇండియాలో కూడా బాగుంటుంది అని అనుకునేవాళ్లం కొన్నేళ్ల వరకు. కానీ గత నాలుగేళ్లుగా బాలేదు. అయినా బ్రహ్మాండంగా ఉంది ఇండియన్ మార్కెట్ మరియు ఎకానమీ. అంటే అమెరికా ఎలా ఉన్నా ఇండియా బాగానే ఉంటుందనేకదా!

ఈ అరుదైన శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదు.

ట్రంప్ గెలిచినందువల్ల రష్యా హ్యాపీగా లేదు… యుద్ధం నేపథ్యంలో ఆంక్షలు పెంచుతాడేమోనని.

ఉక్రైన్ కూడా ప్రశాంతంగా లేదు… ఆయుధాలు అవీ ఇచ్చేది లేదు..ఇక యుద్ధం ఆపు అంటాడేమోనని.

చైనా ప్రశాంతంగా లేదు… తమ ఎగుమతులపై ఏకంగా 40% బాదుతానంటున్నాడని.

తైవాన్ సుఖంగా లేదు- చైనాతో యుద్ధమొస్తే, పక్కవాళ్ల యుద్ధాల్లో వేలు పెట్టడం ఇష్టంలేని ట్రంప్ ఆదుకోడేమోనని.

యూరోప్ సంతోషంగా లేదు… యూరో మార్కెట్ ని డాలరుతో కొడతాడేమోనని.

ఇలా ప్రతి దేశం భయపడుతుంటే మోదీ-ట్రంప్ సఖ్యత వల్ల కొంత, స్వతంత్రంగా ఎకానమీని బలోపేతం చేసుకోవడం వల్ల ఇంకొంత ఇండియా హ్యాపీగానే ఉంది.

మరీ భయంకరమైన రిసెషన్లు, రష్యా రేంజులో అమెరికన్ ఎకానమీ పడిపోవడాలు జరిగితే తప్ప ఇండియాపై ఎఫెక్ట్ అంతగా పడదు. ఎందుకంటే సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ అమెరికన్ ఎకానమీ ఆధారంగా ఉన్నవే. అవి బాగుంటేనే అక్కడున్న మనవాళ్లకి, ఆయా కంపెనీల్లో ఇండియా నుంచి పనిచేస్తున్న వాళ్లకి ఉద్యోగాలుంటాయి. లేకపోతే గల్లంతే. అంత విపత్తు సంభవిస్తే తప్ప ఇండియాపై ఎఫెక్టుండదు. ట్రంప్ హాయాములో అలాంటి విపత్తు జరిగే అవకాశాలు దాదాపు ఉందవని నమ్మకం.

ఎందుకంటే స్వతహాగా ట్రంప్ బిజినెస్ మాన్. అతనికి ఎలాన్ మస్క్ తోడయ్యాడు. ఎకనమీని పరుగెత్తించే దిశలో ఆలోచిస్తున్నారు. కనుక అన్నీ బాగుంటాయి. ఆ ఫలితాలు ఇండియాలో ఉన్న వాళ్లకి కూడా అందుతాయన్నది ఆకాంక్ష.

శ్రీనివాసమూర్తి

6 Replies to “ట్రంప్ కి కలిసొచ్చిన లేడీ లక్”

  1. I felt the same reasons before the election:

    1. Anti-Incumbency Sentiment: Many voters were frustrated with the poor state of the economy.
    2. Gender Bias: Unfortunately, there remains a significant portion of the electorate that would not vote for a woman to hold the highest office, regardless of her qualifications.
    3. Racial Polarization: There’s a deep divide along racial lines, with some White voters—along with other non-Black groups—unwilling to support a Black candidate for president. This reflects ongoing tensions and prejudices that continue to shape political outcomes.
  2. Gender bias is lame excuse ts purely on merit trump won. There are many people who funded her there is full media support.Trump was maligned .but still he won. Media can’t give you success .sympathy garnering has no place in office

Comments are closed.