ఆస్తుల‌పై ష‌ర్మిల మాటే విజ‌య‌మ్మ మాట‌!

ఆస్తుల పంప‌కంపై వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేశారు. మూడు రోజుల క్రితం వైఎస్సార్ అభిమానుల‌కు ష‌ర్మిల రాసిన బ‌హిరంగ లేఖ‌లోని అంశాలే, విజ‌య‌మ్మ లేఖ‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్ జీవించిన…

ఆస్తుల పంప‌కంపై వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేశారు. మూడు రోజుల క్రితం వైఎస్సార్ అభిమానుల‌కు ష‌ర్మిల రాసిన బ‌హిరంగ లేఖ‌లోని అంశాలే, విజ‌య‌మ్మ లేఖ‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్ జీవించిన కాలంలో జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల పంప‌కం జ‌ర‌గలేద‌న్న ష‌ర్మిల మాట‌నే విజ‌య‌మ్మ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు.

ఆస్తుల పంప‌కంలో త‌న కూతురు ష‌ర్మిల‌కు అన్యాయం జ‌రిగింద‌ని, అందుకే ఆమె ప‌క్షాన నిలిచిన‌ట్టు విజ‌య‌మ్మ స్ప‌ష్టం చేయ‌డం విశేషం. ష‌ర్మిల ఇద్ద‌రు పిల్ల‌లు, అలాగే జ‌గ‌న్ ఇద్ద‌రి పిల్ల‌ల‌కు స‌మానంగా ఆస్తులు పంప‌కం చేయాల‌నేది వైఎస్సార్ ఆజ్ఞ‌గా విజ‌య‌మ్మ పేర్కొన్నారు. విజ‌య‌మ్మ బహిరంగ లేఖ‌లోని కీల‌క అంశాలేంటో చూద్దాం.

“రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికీ, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్ధన. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధేస్తోంది. రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ, నేడు అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరుగుతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతోంది. తెలిసి కొంత.. తెలియక కొంత మాట్లాడుతున్నారు. అవి దావానలంలా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వొద్దు. నా పిల్లలిద్దరికే కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు.

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి అసత్యాలు చెప్పారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు మాట్లాడుతున్నది.. వాళ్లు ప్రేమించే వైఎస్ఆర్ గురించేనని మరిచారు. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అనే స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ పిల్లలిద్దరూ పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ముమ్మాటికీ ఆస్తులు పంచడం కాదు. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే, జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు.. అంతే

విజయసాయి రెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు గనక ఆయనకు అన్నీ తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెబుతున్నా. వీరిద్దరూ నా పిల్లలు. ఇద్దరినీ వైఎస్ఆర్, నేను ఎంతో అపురూపంగా, ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. రాజశేఖర్ రెడ్డి మాట ప్రకారం.. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం. ఇదే నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజం. అస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులూ కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత కలిగిన కుమారుడిగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం.

అన్నీ కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ విజయసాయి రెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసీ కూడా అవాస్తవాలు మాట్లాడారు. ఎంవోయూ ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, ఎంవోయూకు ముందు సగం డివిడెండ్ తీసుకొనే వారు. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడూ నేనే సాక్షిని. 2019లో జగన్ సీఎం అయిన రెండు నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్లో జగన్ ప్రపోజల్ పెట్టాడు. జగన్ చెప్పింది ఏంటంటే… “పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు. నీకు అల్లుడు, కోడలు వస్తారు… మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తులు పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలోనే ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి షర్మిలకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంవోయూనే ఈ ఎంవోయూ. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన ఎంవోయూనే ఇది. హక్కు ఉంది గనకే షర్మిలకు రూ.200 కోట్ల డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది గనకే అధికారికంగా ఎంవోయూ రాసుకున్నారు. అందులో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ ఇస్తున్నవి కాదు. జగన్ బాధ్యతతో ఇస్తున్నవి. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా.. ఆటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు.. ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019వరకు కలిసే ఉన్నాం. షర్మిలను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు.

అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం నా ధర్మం..

అయినా, షర్మిల పాలిటిక్స్లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్ధంగా కష్టపడింది. అధికారంలో రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా,అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెబుతున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే” అని విజ‌య‌మ్మ త‌న లేఖలో పేర్కొన్నారు.

45 Replies to “ఆస్తుల‌పై ష‌ర్మిల మాటే విజ‌య‌మ్మ మాట‌!”

  1. దీనితో…అప్పట్లో విజయమ్మ కార్ ప్రమాదాన్ని కూడా అనుమానించాలి…అన్న హిస్టరీ ప్రకారం

  2. వీళ్ళు ప్రతి సంవచ్చరం డివిడెంట్ల మీదె ఇంథ సంపాదిస్తున్నరు అంటె, నిజంగా ఈ రాష్ట్రాన్ని ఎలా నాకెసారొ అర్ధం అవుతూనె ఉంది.

  3. మరి paytm జొర్నొలిస్ట్లు మా జగన్ అన్నా అంత ఇచ్చాదు, ఇంత ఇచ్చడు, ఇంత ఇచ్చాడు అని తెగ మొరిగారు. ఎ అన్న అన్నా అలా ఇస్టాడా అని తెగ ఎలివెషన్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమంటారొ?

  4. రేపు విజయమ్మకు సాక్షిలో సన్మానం…నేటి రాత్రంతా అక్షరాలు అగ్నిగోళాల్లా ఎగసిపడతాయి.

  5. ఈమె వ్యవహారం చూస్తుంటే… మొత్తం ఆస్థి షర్మిల దె అన్నట్టు మాట్లాడుతోంది.

    భారతి సిమెంట్స్, సాక్షి మీ ప్రకారం రాసిచ్చేసాడుఅంటున్నారు!

    సరస్వతి లో 100%, యెలహంక ప్రాపర్టీ లో 100%, షర్మిల కె… ఇక జగన్ కేం మిగిలింది?

    బిజినెస్ లో Involve చెయ్యలేదు అన్నప్పుడు సంపాదించిన వాడికి ఏంటి లాభం? అయన రెక్కల కష్టం తో అంచెలంచెలుగా సిమెంట్ అండ్ పేపర్ ను నిలబెట్టి ఈ స్థాయికి తెచ్చినవాడి నుండి అన్ని గుంజుకుంటే ఆయనెలా బతకాలిఆయనకు పిల్లలున్నారు గా??

    ఇదేం న్యాయం బాబోయ్!

    ఆడవాళ్ళ ఆశెకు ఆకాశమే హద్దు లా ఉంది.

    1. కన్న త*ల్లి చెప్పాక కూడా మా జ*గ*న్ రె*డ్డి ఉత్తముడు అంటున్నావంటే నువ్వు జ*గ*న్ కి గుడ్డి భక్తుడివి అయి ఉండాలి, వి*జ*య*మ్మ లెటర్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంతేకాని అర్థం కాక అమాయకంగా ఇదేం న్యాయం బాబోయ్ అంటే చేసింది అన్యాయం కాకపోదు

    2. ఆడవాళ్ళ ఆశెకు ఆకాశమే హద్దు లా ఉంది… భారతి రెడ్డి గురించేనా.. కరెక్టే..

        1. ఓహో.. పొద్దున్నే మూడింటికి అవినాష్ బావ ని అడగండి..

          లేదంటే.. అవినాష్ బావ కి కాఫీ అందిస్తున్న జగన్ రెడ్డి బావ ని అడగండి..

    3. Reddy garu ninnati daka Jagan premato istunnadu annaru. ippudu avi YS asthulani..ayanka naluguru pillalaki samanam ani chepparu ani ame clear cheptundi. inka meeru Jagan ki support chestunte navvi vasthundi

  6. మీరు ఆస్తులకోసం కొట్టుకుంటే అది రాష్ట్రానికి ఎలా మంచిది కాదు? అసలు రాష్ట్రానికి, ప్రజలకు ఏమి సంబంధం?

  7. “అస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులూ కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత కలిగిన కుమారుడిగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం.”

    ఆస్తులను సంరక్షణ చెయ్యడానికి జగన్ మీద కే*సు*లు వస్తే పాప దాంట్లో వాటా తీసుకోదా? జగన్ పక్షం వహించి అంటున్నది కాదు, తల్లీ బిడ్డ న్యాయం లెక్క న చెబుతుంది!

  8. విజయమ్మ చెప్పింది 100%నిజం అని బుర్ర బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    మరి మావోడికి ఆ రెండూ లేవు కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోడు.. తప్పు కప్పి పుచ్చుకోవడానికి ఎదురు దాడి చేసి ఇంకో పది తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    జెగ్గులు కరెస్టే కదా??

  9. విజయమ్మ చెప్పింది 100%నిజం అని బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    మరి మావోడికి ఆ రెండూ ‘లేవు కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోడు.. ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ఎర్రెదవ లా ఎదురు దాడి చేసి ఇంకో పది తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    కరెస్టే కదా జెగ్గులా??

  10. విజయమ్మ చెప్పింది 100%నిజం అని బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    మరి మావోడికి ఆ రెండూ ‘లేవు కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోడు.. ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ‘ఎర్రెదవ లా ఎదురు ‘దాడి చేసి ఇంకో పది ‘తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    కరెస్టే కదా జెగ్గులా??

  11. ‘విజయమ్మ చెప్పింది 100% నిజం అని ‘బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    ‘మరి మావోడికి ఆ రెండూ ‘లేవు ‘కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోని ‘తప్పు సరి చేసుకోడు. ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ‘ఎర్రెదవ లా ఎదురు’దాడి చేసి, ఇంకో ‘పది ‘తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    ‘కరెస్ట్ గా చెప్పాను కదా జెగ్గులా??

  12. ఈ మహత్తరమైన లేఖలో “నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని విచారం వ్యక్తం చేశారు.“

    తల్లీ..అది దిష్టి కదమ్మా, కర్మ ఫలం.

    మూడు తరాల వింద్వంశకాండ..

    మామగారు, పెనిమిటి, మరిది..ఈ చావులన్నీ కూడా దిష్టేనా తల్లీ..

  13. మంది సొమ్ము అప్పనంగా దోచుకున్నప్పుడే తప్పు రా పురుగులు పట్టి పోతాము అని చెప్పుంటే ఇవాళ ఆ దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఇలా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా విజయమ్మ గారు..

  14. మంది సొమ్ము అప్పనంగా దోచుకున్నప్పుడే తప్పు రా పురుగులు పట్టి పోతాము అని చెప్పుంటే ఇవాళ ఆ దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఇలా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా @‘విజయమ్మ గారు..

Comments are closed.