ఆమెకు చంద్రబాబు బావ ఎలా అవుతాడు ?

ఈ తరం వాళ్లకు వావి వరుసలు తెలియవు. ప్రస్తుతం తెలియనివారి శాతం ఎక్కువగా ఉంది. అది జనరేషన్ మహత్యం అని సరి పెట్టుకోవాల్సిందే. కానీ వెనుకటి తరం వారికి లేదా వయసులో పెద్దవారికి  వరుసలు…

ఈ తరం వాళ్లకు వావి వరుసలు తెలియవు. ప్రస్తుతం తెలియనివారి శాతం ఎక్కువగా ఉంది. అది జనరేషన్ మహత్యం అని సరి పెట్టుకోవాల్సిందే. కానీ వెనుకటి తరం వారికి లేదా వయసులో పెద్దవారికి  వరుసలు తెలియవా? అవును …అలా తెలియనివారు కూడా ఉన్నారు. అలాంటివారిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కనబడుతున్నాడు.

ఈయన దాదాపు ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల వేదికగా టీడీపీ మీద, చంద్రబాబు మీద, ఆయన కుమారుడు లోకేష్ మీద విమర్శలతో విరుచుకుపడుతుంటారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి బీజేపీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అద్యక్షురాలు, చంద్రబాబు దగ్గరి బంధువైన పురందేశ్వరి మీద కూడా విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఆయన చేసిన విమర్శలో పురందేశ్వరికి చంద్రబాబు బావ అవుతాడని అన్నారు. కొంతకాలం కిందట మరణించిన చంద్రబాబు బంధువు, సినిమా నటుడు తారకరత్నద్వారా విజయ సాయి రెడ్డి కూడా బాబు బంధు వర్గంలో ఒకడని చెప్పుకోవచ్చు.

అలాంటి విజయసాయిరెడ్డికి బంధుత్వాలు తెలియవా? పురందేశ్వరికి చంద్రబాబు బావ ఎలా అవుతాడు.ఎన్ఠీఆర్ అల్లుళ్ళలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దల్లుడు. ఆయన భార్య పురందేశ్వరి. బాబు ఎన్ఠీఆర్ రెండో అల్లుడు. అలాంటప్పుడు బాబు పురందేశ్వరికి మరిది అవుతాడు కదా. విజయసాయిరెడ్డి వరుస మార్చేశారు. 

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు అవినీతి, కేసును అడ్డుపెట్టుకొని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై సెటైర్లు వేశారు. పురందేశ్వరిని చెల్లమ్మా అని సంబోధిస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయడం అటు బీజేపీ, ఇటు టీడీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అవినీతి కేసులో చిక్కుకున్న బావను కాపాడుకునేందుకు ప్రయాస పడుతున్నారంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్‌లు, బీజేపీ అభివృద్ది కోసమే ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదని.. బావ కోసం ఢిల్లీ యాత్రలు చేయడం వృధా ప్రయాస అంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ. దీనిపై నెటిజన్లు విజయసాయిరెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. విజయసాయి పోస్టు ఇంకా చాలా పెద్దగా ఉందనుకోండి. అది ఇక్కడ అనవసరం.