విశాఖను జీ 20 సదస్సుకు వేదికగా కేంద్రం ఎంపిక చేసింది. ఏడాది పాటు దేశమంతా జీ 20 సదస్సులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన నగరాలను ఎంపిక చేస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో రెండు సార్లు జీ 20 సన్నాకహ సదస్సులు నిర్వహిస్తునారు. వాటి కోసం విశాఖను వేదికగా సెలెక్ట్ చేయడం విశేషం.
విశాఖలో అదే సమయంలో గ్లోబల్ ఇన్వెసెట్మెంట్ సమ్మిట్ కూడా జరగనుంది. దాంతో స్మార్ట్ సిటీ ప్రాముఖ్యత మరింతగా పెరగనుంది. విశాఖను రాజధానిగా చేసుకోవాలని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అంది వచ్చిన అవకాశంగా అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు ఇపుడు వైజాగ్ లో జరగనున్నాయి.
అటు హైదరాబాద్, ఇటు బెంగుళూరు, మరో వైపు చెన్నైలకు విశాఖ నుంచి రైల్ ఎయిర్ కనెక్టివిటీని ఇటీవల కాలంలో పెంచే కార్యక్రమం జోరుగా సాగుతోంది. విశాఖ నుంచి విజయవాడ టూ హైదరాబాద్ దాకా వందేభారతం ఎక్స్ ప్రెస్ ని కేంద్రం మంజూరు చేసింది. అలాగే విశాఖ నుంచి తిరుపతికి కూడా మరో వందేభారతం ఎక్స్ ప్రెస్ ని కూడా రెడీ చేస్తున్నారు. అలా చెన్నై దాకా కూడా రైల్ కనెక్టివిటీని కొనసాగించనున్నారు.
విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీని ఈ మధ్య కాలంలోనే మరింతగా పెంచారు. విశాఖ నుంచి బెంగుళూరు కి ప్రతీ రోజు విమాన సేవలు అందిస్తూ ఆకాశ ఎయిర్ విమాన సర్వీసుని ఇటీవల ప్రారంభించారు. దాన్ని ప్రారంభించిన మంత్రి గుడివాడ అమరనాధ్ విశాఖ క్యాపిటల్ సిటీ అని ఇతర క్యాపిటల్ సిటీలతో అనుసంధానం పెద్ద ఎత్తున జరుగుతోంది అని పేర్కొన్నారు. ఈ కొత్త సర్వీస్ ద్వారా రోజుకు రెండు సార్లు విశాఖ నుంచి బెంగుళూర్ కి విమానాలు నడుస్తాయి.
దేశంలోని ఇతర నగరాలతో కూడా విశాఖకు కనెక్టివిటీ రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుంది అని మంత్రి తెలియచేశారు. విశాఖలో ఉన్న అవకాశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుదని ఆయన చెప్పడమూ విశేషం. విశాఖలో అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా త్వరలో రాబోతున్నాయని తీయని కబురుని మంత్రి వినిపించారు. మొత్తానికి విశాఖ ప్రాధాన్యత పెరుగుతోంది. వైసీపీ ఆలోచనలకు తగినట్లుగా కేంద్రంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇపుడు విశాఖ వైపు చూస్తున్నాయి.