విశాఖ ఉక్కు మరింత కాలం సమర్ధంగా పనిచేయాలంటే ఉన్న ఉద్యోగులను తగ్గించాల్సిందే అని ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక అధికారులు అంటున్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తికి అధిక ఉద్యోగులే సమస్యగా చెబుతున్నారు. పనిచేసే వారి కంటే చేయని వారే అదనంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి అని అంటున్నారు.
విశాఖ ఉక్కు లాభాల బాటలో నడవాలీ అంటే నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలన్నది యాజమాన్యం విధానంగా కనిపిస్తోంది. దానికి వారు అనుసరిస్తున్న మార్గం ఉన్న ఉద్యోగులను తగ్గిస్తూ పోవడం. ఎక్కువ పని తక్కువ సిబ్బందితో చేయించడమే కాదు నాణ్యమైన పనిని తాము రాబట్టుకుంటామని అంటోంది.
ఇప్పటికే విశాఖ ఉక్కు నుంచి 1,140 మంది ఉద్యోగులను వీఆర్ ఎస్ ఇచ్చి పంపించేశారు. ఇది మొదటి దశ అని అంటున్నారు. ఈ విధంగా మరింత మందిని పంపించడానికి నిర్ణయించారని తెలుస్తోంది. విశాఖ ఉక్కు కంటే రెట్టింపు సామర్ధ్యం ఉన్న సంస్థలలో ఇంతకంటే తక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెబుతున్నారు. దానిని విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా అమలు చేయాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర ఉక్కు శాఖ అధికారులు వచ్చారు. వారు విశాఖ ఉక్కు గురించి మాట్లాడారని తెలిసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం మీద ఏ రకమైన ప్రతిపాదనలూ ఇప్పటిదాకా తమ వద్ద లేవని ఈ భేటీలో పాల్గొన్న అధికారులు తెలిపారు.
విశాఖ ఉక్కుని బలోపేతం చేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ఆలోచనలు లేవని అంటున్నా సిబ్బందిని పెద్ద ఎత్తున తగ్గించాలనుకోవడం ఖర్చులు సగానికి సగం కుదించాలని నిర్ణయించడం వంటి చర్యలతో కార్మిక సంఘాలలో అయితే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలన్న 2021 నాటి నిర్ణయం మీద ఈ రోజుకీ వెనక్కి అడుగులు వేశామని ఎక్కడా ప్రకటించింది లేదు, దాంతో విశాఖ ఉక్కు విషయంలో ఏమి జరుగుతుంది అన్నది అంతుబట్టడంలేదు. ఉద్యోగుల కుదింపు తప్పనిసరి అని యాజమాన్యం చెబుతూండడంతో ప్రైవేటీకరణకు ఇది మరో మార్గంగా భావిస్తున్నారు.
మంచిది ..
2021 లో ఏం చేసావ్
ఏ ప్రభుత్వ సంస్థ చూసిన ఇదే ధోరణి కదా .. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇక జీవితాంతం పని చెయ్యకుండా తిని కూర్చోడం .. కుదిరిన చోటా లంచాలు లేనిచోట సైడ్ బిజినెస్ చేసుకోవడం .. ఇంతా చూస్తూ కూడా జనాలు మరిన్ని ప్రభుత్వ ఉద్గోగాలు నోటిఫికేషన్ ఇవ్వండని డిమాండ్లు చెయ్యడం విచిత్రం
ఇటువంటి అనవసర వ్యాపారాల్లో ప్రభుత్వం తలదూర్చకుండా ఆ ఖర్చు పోలీస్ , కోర్టులు వంటి ఉద్యోగాలు పెంచితే జనానికి ఉపయోగం
స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు లేక ప్రభుత్వాలే పెద్ద పరిశ్రమలు కట్టాయి .. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక ప్రభుత్వం వీటినుంచి తొలగాలి .. జనానికి అవసరమైన విద్యా , పోలీస్ లాంటి వాటిలో ఖర్చు పెట్టాలి వాటిని సంస్కరించాలి
ee sutti…nuvvu oka five years nundi cheputhunnavu…akkada jarigindhi emi ledhu…evadiki poindhi emi ledhu..nee gola thappa…
Job తెచ్చుకోవటం చేతకాని ఎధవలు ఇలాగే మాట్లాడతారు ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎవరివి ప్రజలవి లాభాలు వస్తే వాల్లకి నష్టాలు వస్తే ప్రభుత్వం వారికి write off చేసి ఆ నష్టం మొత్తం మన దగ్గర వసూలు చేస్తారు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి రాజకీయ నాయకులు ఎలక్షన్ లొ గెలవడం కోసం వాళ్ళ బాబుగారి సొత్తు లాగా ఉచితాలు ప్రకటిస్తారు కదా ఆ సొమ్ము మనదే పేరు ఎవడిది ఆలోచించండి. ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ప్రైవేట్ సంస్తే ఆ తరువాత వాళ్లు ఏమి చేసారో మరిచిపోయారా మనకు వాళ్ళ నుంచి స్వతంత్రమ్ వచ్చి 75 years మాత్రమే అవుతుంది ఆలోచించండి
తెల్ల ఏనుగులను మేపాలంటే పేద ప్రజలకు సాధ్యం కాదు కచ్చితం గ అమ్మేయాల్సిందే