తాంబూలాలు ఇచ్చేశారు.. ఎవరు మేయర్?

అధికారులు ఆ విధంగా తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది రాజకీయ పార్టీయే.

తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది కార్పోరేటర్లే. వారితో పాటు వెనక ఉన్న రాజకీయ పార్టీలే. రాజకీయ వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు నంబర్ గేములు ఇవన్నీ అధికారాన్ని చేతిలో పెడతాయి. వీటిలో ఎవరు బాగా పండితే వారికే పీఠం దక్కుతుంది. విశాఖ మేయర్ పీఠం కోసం ఒక మాదిరి పొలిటికల్ ఫైట్ అయితే విశాఖలో సాగుతోంది.

నాలుగు దశాబ్దాల క్రితం జీవీఎంసీ మేయర్ గా టీడీపీ అవకాశం అందుకుంది. మళ్ళీ ఇన్నేళ్ళలో ఆ పదవిని చూడలేదు, కుర్చీ ఎక్కలేదు. దాంతో ఈసారి ఎలాగైనా ఆ చాన్స్ దక్కించుకోవాలని ఆశ పడుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. జీవీఎంసీలో 12 మంది దాకా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు చాలా మంది వైసీపీ నుంచి కార్పోరేటర్లు ఈ వైపుకు వచ్చి సైకిలెక్కేశారు.

దాంతో మేయర్ పీఠం మాదే అని భావిస్తోంది. కానీ ఎక్కడో ఏదో తెలియని కలవరం అయితే ఉంది. మొత్తం 99 మంది కార్పోరేటర్ల నంబర్ లో మూడింట రెండు వంతుల మంది సపోర్టు చేస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. ఒక్కరు అటు నుంచి ఇటు అయినా అంతా వృధా అవుతుంది పైగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాంతోనే ఆచీ తూచీ అడుగులు వేస్తోంది టీడీపీ నాయకత్వంలోని కూటమి.

ఏప్రిల్ నెలలోకి అడుగుపెడుతూనే విశాఖ మేయర్ మీద అవిశ్వాసానికి ఒక డేట్ ని అధికారులు ఫిక్స్ చేసినట్లుగా వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి. ఈ నెల 19న అవిశ్వాసానికి ముహూర్తంగా పెట్టారని అంటున్నారు. అధికారులు ఆ విధంగా తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది రాజకీయ పార్టీయే.

క్యాంప్ పాలిటిక్స్ తో వైసీపీ, టీడీపీ వేడెక్కిస్తున్న క్రమంలో దాదాపుగా మరో 18 రోజుల పాటు ఇదే విధంగా అంతా జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అటు వారు ఇటు రాకుండా గేటు దాటకుండా చూడాల్సి ఉంటుంది. మేయర్ విషయంలో అవిశ్వాసానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అంటున్నారు. దీంతో ఎవరి రాజకీయ వ్యూహాలలో వారు తీరిక లేకుండా ఉన్నారు. ఈ నెల 19న విశాఖ మేయర్ ఎవరో తేలిపోతుంది అని అంటున్నారు. దీంతో విశాఖలో పాలిటిక్స్ సమ్మర్ హీట్ ని మించేస్తోంది.

One Reply to “తాంబూలాలు ఇచ్చేశారు.. ఎవరు మేయర్?”

Comments are closed.