ఉక్కు లాంటి ఆయన గుర్తుకొస్తున్నారు

ఆనాడు ఎంతో బలంగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కదిలించడం అంటే ఏ మాత్రం చిన్న మాట కానే కాదు. అలాగే రెండవ పార్టీ అన్నదే లేకుండా వరస విజయాలతో అపరిమిత అధికారాన్ని అనుభవిస్తున్న…

ఆనాడు ఎంతో బలంగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కదిలించడం అంటే ఏ మాత్రం చిన్న మాట కానే కాదు. అలాగే రెండవ పార్టీ అన్నదే లేకుండా వరస విజయాలతో అపరిమిత అధికారాన్ని అనుభవిస్తున్న ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించడం అంటే సామాన్య విషయం కానే కాదు.

కానీ ఈ రెండింటినీ ఒకేసారి సాధించి ఉద్యమం అంటే ఉక్కులా ఉండాలని భావి తరాలకు పాఠంలా ముందుంచిన సిసలైన ఉద్యమకారుడు అమృతరావు. ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ కలెక్టరేట్ వద్ద అరవై దశకం చివరిలో చేసిన మహోగ్రమైన అమరణ నిరాహారదీక్షకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదలిపోయాయి.

ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపి విశాఖలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టించేలా ఒక కీలక ప్రకటన చేయించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ వచ్చి అమృతరావు దీక్ష చేస్తున్న శిబిరంలో ఆయనకు కేంద్రం ప్రకటనను చూపించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

అలా అమృతరావు తో సహా ఎంతో మంది ఉద్యమాకారుల కృషి ఫలితంగా విశాఖ ఉక్కు దక్కింది. అమృతరావు చేసిన ఉద్యమానికి ఈ రోజుతో 59 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఉక్కు కార్మికులు ఆయనను తలచుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఇపుడు ప్రైవేటుకు గురై దశ దిశ తెలియకుండా ఉన్న వేళ ఉద్యమ స్పూర్తిని తమలో నింపమని వారంతా ఆయనను కోరుకుంటున్నారు.

కేంద్ర పెద్దలలో కదలిక వచ్చేలా చేసి ప్రైవేట్ గండం నుంచి విశాఖ ఉక్కుని పరిరక్షించాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అమృతరావు లాంటి ఉద్యమకారులు ఈనాడు కావాలి. అంతే కాదు ఎంత పట్టుదలగా ఉన్నా కూడా ప్రజల ఆకాంక్షలను గుర్తించి గౌరవించే శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి ఏలికలు కూడా ఉండాలి. అపుడే విశాఖ ఉక్కు కర్మాగారమే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

12 Replies to “ఉక్కు లాంటి ఆయన గుర్తుకొస్తున్నారు”

  1. ఎవరో ఎందుకు జగన్ మోహన్ రెడ్డి అభినవ అమృత రావు అవతారం ఎత్తితే సరిపోతుంది కదా

          1. ఒరేయ్ ముండ కొడకా….వాడేరా విజయ్ సాయి గాడు, జగన్ గాడు ర్యాలీ చేశారు కానీ ఢిల్లీ లో ఏమి పీకలేదు

  2. పాపం మన అన్నయ్య ఐతే అక్కడ steel plant లేపేసి capital కట్టి develop చేద్దామని అనుకున్నాడు….పాపం ఎవరూ అర్థం చేసుకోలేదు…so sad కదా GA…

  3. ఉద్యోగస్తుడకు ఉపాధి పొతే బాధపడాలి పోరాడాలి కానీ ప్రభుత్వమే నడపాలి అని పట్టుపడతన్నారంటే అర్ధం ఏమిటి పని దొంగలు ప్రజల కట్టిన పన్నులు వీళ్ళ నిర్వాహకానికి నష్టం వస్తే ఎందుకు వాడాలి కచ్చితం గ ప్రైవేట్ కి ఇవ్వలిసిందే ఫ్యాక్టరీ కి అవసరమైన భూములను ఫ్యాక్టరీ తో అమ్మేసి మిగిలిన వాటిని కొత్త పరిశ్రమలకు లేఔట్ లకు వేసి ఆ డబ్బుతో విశాఖ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఖర్చు పెట్టి ఉపాధి పెంచాలి

Comments are closed.