ఆ నిర్మాతలను కాస్త చూసుకోండి

సినిమా వర్క్ జరుగుతుంటే ఇది అలా అలా తగ్గుతూ వెళ్తుంది. అఖరికి డెఫిసిట్ లో విడుదల కాకుంటే చాలు భగవంతుడా అనిపించేస్తారు.

నిర్మాత మెత్తని వాడైతే దర్శకులు చెలరేగిపోతారు. ఇక ఖర్చుకు అదుపు వుండదు. ముందుగా సినిమాటోగ్రాఫర్ దగ్గర మొదలవుతుంది. టాప్ సినిమాటోగ్రాఫర్ అయితే ఇక దర్శకుడి పని సగానికి సగం తగ్గిపోతుంది. ఫ్రేమ్ లు, కలర్ టోన్ ఇవన్నీ సినిమాటోగ్రాఫర్ చూసుకుంటాడు. కథ, స్క్రిప్ట్ తాను చూసుకుంటే చాలు.

సినిమాటోగ్రాఫర్ కు తోడు పెద్ద మ్యూజిక్ డైరక్టర్ కావాలి, సీన్ లో డెప్త్ తగ్గినా తన బ్యాంగ్ బ్యాంగ్ సౌండింగ్ తో కవర్ చేసేస్తాడు. ఇక వీటికి తోడు భారీ సెట్లు, భారీ లోకేషన్లు. నిర్మాతలు ఖర్చు పెడుతూ పోవడమే.

కాంబినేషన్ తో సినిమా స్టార్ట్ చేసినపుడు కనీసం ఇరవై, ముఫై కోట్లు లాభం కళ్ల ముందు కనిపిస్తుంది. సినిమా వర్క్ జరుగుతుంటే ఇది అలా అలా తగ్గుతూ వెళ్తుంది. అఖరికి డెఫిసిట్ లో విడుదల కాకుంటే చాలు భగవంతుడా అనిపించేస్తారు. ఇది ఒక దర్శకుడు అని కాదు. ఇప్పుడు కమర్షియల్ భారీ సినిమాలు చేస్తున్న అరడజను మంది దర్శకులది ఇదే దారి. నిర్మాతలు కక్కలేరు, మింగలేరు. మీడియా కనుక రాస్తే ఎవరు చెప్పారు? ఎలా తెలుసు అంటూ కస్సు బుస్సులు. పైగా నిర్మాతల చేతే ఖండింపచేస్తారు.

ఇప్పుడు ఓ నిర్మాత రెండు భారీ క్రేజీ సినిమాలు ప్రారంభించారు. రెండింటి దర్శకులు ఇలాంటి అలాంటి వాళ్లు కాదు.. ఖర్చు విషయంలో. నిర్మాతకు ఈ ఇద్దరు దర్శకులు ఓ రూపాయి అయినా మిగులుస్తారా అన్నది అనుమానమే. వన్స్ మొదలుపెట్టడం వరకే నిర్మాత చేయగలిగింది. ఇక తరువాత చెక్కులు సంతకాలు చేసుకుంటూ పోవాల్సిందే.

ఇంకో బ్యానర్ కాస్త ఇబ్బందుల్లో వుంది. మంచి ప్రాజెక్ట్ చేతిలోకి వచ్చింది. కానీ ఇక్కడా ఇదే సమస్య. దర్శకుడు అడ్డగోలుగా ఖర్చు చేయించేస్తారు అనే పేరు వుంది. మరి కంట్రోల్ అన్నది నిర్మాతల వల్ల కాదు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల అయినా నిర్మాత ఓ రూపాయి లాభం చేసుకోగలరా అన్నది అనుమానం.

ఇంకో నిర్మాత వున్నారు. మంచి వ్యక్తి, కానీ ఇప్పటి వరకు లాభం అన్నది కళ్ల చూడలేదు. అయన వరుసగా రెండు ప్రాజెక్ట్ లు తలకెత్తుకుంటున్నారు. కానీ తీసుకుంటున్న హీరోలు, దర్శకులు అంతా కలిసి ఓ పది పైసలు అయినా లాభం మిగులుస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏమైనా దర్శకులు ఈ నిర్మాతలను కాస్త దయతలచాలి.

6 Replies to “ఆ నిర్మాతలను కాస్త చూసుకోండి”

Comments are closed.