స్టీల్ ప్లాంట్ టోటల్ నంబర్ అది …ఆ ఒక్కటీ తప్ప

విశాఖ ఉక్కు కర్మాగారం లో ఒక కీలకమైన విభాగాన్ని పరిపుష్టి చేయడం కోసం ఆ సంస్థ యాజమాన్యం బిడ్లను ఆహ్వానిస్తే గడువు ముగిసే సమయానికి 29 కంపెనీల నుంచి బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ…

విశాఖ ఉక్కు కర్మాగారం లో ఒక కీలకమైన విభాగాన్ని పరిపుష్టి చేయడం కోసం ఆ సంస్థ యాజమాన్యం బిడ్లను ఆహ్వానిస్తే గడువు ముగిసే సమయానికి 29 కంపెనీల నుంచి బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 15తో మొదటి విడత గడువు ముగిస్తే అప్పటికి 22 బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 20తో రెండవ విడత గడువు ముగిసిన తరువాత మరో ఏడు కొత్తగా వచ్చి చేరాయి.

మొత్తంగా చూస్తే ఇందులో ఎక్కడా తెలంగాణా నుంచి బిడ్ ఏదీ దాఖలు కాలేదు. సింగరేణీ కాలరీస్ తరఫున బిడ్ ని దాఖలు చేసేందుకు తెలంగాణాలోని బీయారెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి చడీ చప్పుడూ ఏమీలేదు.అన్నది తెలిసిన సమాచారం.

గడువు పొడిగించిన తరువాత అయినా దాఖలు చేస్తారేమో అని ఉక్కు కార్మికులు ఆసక్తిని ప్రదర్శించారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ అయితే లేదని బిడ్లు దాఖలు గడువు ముగిసాక అర్ధం అయింది. ఇదే విషయం  మీద మాట్లాడిన ఉక్కు కార్మిక సంఘం నాయకుడు అయోధ్య రాం సింగరేణి కాలరీస్ నుంచి బిడ్ దాఖలు అయినట్లుగా లేదని అన్నారు.

ఈ బిడ్లకు సంబంధించి ఏడు విదేశీ కంపెనీలు కూడా ఉండడం విశేషం. అయితే దేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు నుంచి బిడ్లు దాఖలు కాలేదని అంటున్నారు. ఇపుడు స్టీల్ ప్లాంట్ ఎవరిని కాంట్రాక్ట్ కి ఆహ్వానిస్తుందో ఎవరితో స్టీల్ ప్లాంట్ ప్రయాణం ఉందో చూడాలి. దానికి బట్టి ప్రైవేటీకారణ వ్యవహారం ఏ తీరం సాగుతుందో అర్థమవుతుంది అని అంటున్నారు.