జనసేనాని పవన్‌కల్యాణ్ వాలంటీర్లపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మల్ని వాలంటీర్లు దగ్ధం చేస్తున్నారు. మరోవైపు వాలంటీర్లపై పవన్ ఏ మాత్రం తగ్గడం లేదు. మళ్లీమళ్లీ తన వ్యాఖ్యల్ని సమర్థించుకునేందుకు కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం తప్ప, తెలివిగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పవన్‌ను దత్త పుత్రుడిగా భావిస్తున్న ఎల్లో మీడియా, ఆయన కామెంట్స్‌కు బలం కలిగించేందుకు శ్రమిస్తోంది. రాష్ట్రంలో ఏ వాలంటీరైనా తప్పు చేస్తే చాలు, దాన్ని పెద్దగా చూపించడాన్ని ఉత్సాహం ప్రదర్శిస్తోంది. అయితే పవన్‌కల్యాణ్ అనే పేరు గల ఓ వాలంటీర్ పోకిరీ చేష్టకు పాల్పడినట్టు ఎల్లో పత్రిక రాసుకొచ్చింది. ఇక్కడ వాలంటీర్ కంటే, పవన్ పేరు ప్రముఖంగా చర్చకు వస్తోంది. అదేంటి, ఇతని పేరు కూడా పవన్కల్యాణేనా, చేతల్ని బట్టి పేరు పెడతారా? అనే సెటైర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎల్లో పత్రిక రాసిన ప్రకారం పవన్ కల్యాణ్ అనే వాలంటీర్ ఏం చేశాడో తెలుసుకుందాం.
నంద్యాల జిల్లా సున్నిపెంట ఈస్ట్రన్ కాలనీలోని సచివాలయం-1 పరిధిలో పవన్‌కల్యాణ్ అనే వాలంటీర్ పని చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చాలా దగ్గర చేసింది. ఆమెతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీశాడు. అంతటితో ఈ పోకిరీ ఎదవ ఆగలేదు. తన స్నేహితుడు రాంబాబు ద్వారా వాటిని సోషల్ మీడియాలో పెట్టించాడు.
ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకి తెలిసి లబోదిబోమన్నారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్‌తో పాటు అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ యువతి వ్యక్తిగత జీవితంతో ఆడుకున్న వాలంటీర్ పేరు పవన్‌కల్యాణ్ కావడం నెటిజన్లకు ఆయుధం లభించినట్టు వాలంటీర్ ఇంటి పేరు ఎలకపాటి, ఆయన ఇంటి పేరే తేడా… మిగతావన్నీ సేమ్ టు సేమ్ అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం.