సీఎం రమేష్ వెయింటింగ్ మినిస్టర్?

తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాను అని సీఎం రమేష్ బాగానే లెక్కలు వేసుకున్నారు అని ప్రచారం జరిగింది. ఆయన అనకాపల్లికి అనూహ్యంగా బదిలీ చేయబడ్డారు. కానీ స్థానిక ప్రజలకు పెద్దగా గుర్తు తెలియని…

తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాను అని సీఎం రమేష్ బాగానే లెక్కలు వేసుకున్నారు అని ప్రచారం జరిగింది. ఆయన అనకాపల్లికి అనూహ్యంగా బదిలీ చేయబడ్డారు. కానీ స్థానిక ప్రజలకు పెద్దగా గుర్తు తెలియని బీజేపీ నుంచి గెలిచి నాన్ లోకల్ ముద్రను చెరిపేసుకోగలిగారు. 1960లో అనకాపల్లి పార్లమెంట్ ఏర్పాటు అయితే ఇప్పటిదాకా వచ్చిన అతి పెద్ద మెజారిటీ సీఎం రమేష్ దే కావడం విశేషం.

ఆయన మూడున్నర లక్షల పై చిలుకు భారీ మెజారిటీ సాధించి అందరికీ షాక్ తినిపించారు. తన సామాజిక వర్గం, బీజేపీ అగ్రనేతల సాన్నిహిత్యం అన్నీ కలసి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ టీడీపీ కోటాలో ఆ పదవిని దక్కించుకున్నారు.

రామ్మోహన్ కే చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ నుంచి చూస్తే పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలకే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. ఈసారి ఈ విధానం అమలు చేయడంతో ఎవరూ అనుకోని విధంగా నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది.

బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి మంత్రి పదవులు అయితే ప్రస్తుతానికి ఇవ్వడం లేదని తేల్చేశారు. అయిదేళ్ల కాలం నిండా ఉంది. దాంతో ఇపుడు కాకపోతే మరోసారి అని వేచి చూడడమే  రమేష్ లాంటి వారు చేయాల్సిన పని. అయితే రామ్మోహన్ నాయుడు ఫుల్ టెర్మ్ కేంద్ర మంత్రిగా కొనసాగితే మాత్రం రమేష్ కి చాన్స్ దక్కకపోవచ్చు అని అంటున్నారు. బీజేపీతో టీడీపీ సంబంధాలు ఎలా ఉంటాయన్న దాని మీదనే ఇదంతా ఆధారపడి ఉంది.