లోకేష్ ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో..

అత్యుత్సాహానికి పోయి అతిగా స్పందించేస్తే.. ఆ తర్వాత ఇక్కట్లే ఎదురవుతాయి. అతి చేస్తే.. మొహం చూపించడానికి కూడా గతిలేని పరిస్థితి వస్తుంది. అయినా ఇదంతా పరువుగా వ్యవహరించాలని, పరువు ఉండాలని కోరుకునే నాయకులకు గానీ..…

అత్యుత్సాహానికి పోయి అతిగా స్పందించేస్తే.. ఆ తర్వాత ఇక్కట్లే ఎదురవుతాయి. అతి చేస్తే.. మొహం చూపించడానికి కూడా గతిలేని పరిస్థితి వస్తుంది. అయినా ఇదంతా పరువుగా వ్యవహరించాలని, పరువు ఉండాలని కోరుకునే నాయకులకు గానీ.. అందరికీ వర్తించే సిద్ధాంతం కాదు. 

ఇక విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల కిందట ఒక సంఘటన జరిగింది. శ్రీజ డెయిరీ వారు ఒక గ్రామానికి పాల సేకరణ నిమిత్తం ఆటో పంపడం మానేశారు. హఠాత్తుగా ఆటో రాకపోయేసరికి.. ఆ గ్రామంలో పాడి రైతులు ఆ రోజు సేకరించిన పాలను రోడ్డు మీద పారబోసేశారు. (ఆ తర్వాతి రోజు  ప్రత్యామ్నాయ మార్గాల్లో అమ్ముకునే ఉంటారు) ఒక్కసారి మాత్రమే ఇలా పారబోయడం జరిగింది. ఇదీ అసలు జరిగిన సంఘటన.

ఇలాంటి ఒక సంఘటన జరగగానే.. ఇక దానికి చిలవలు పలవలు జతచేసి.. ఇంత చిన్న సంఘటనను కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ముడిపెట్టి బురద చల్లడానికి అటు పచ్చమీడియా ఇటు తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయాయి. ఆ గ్రామంలోని ప్రజలు.. తెలుగుదేశం నిర్వహించిన మినీ మహానాడుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని.. అందుకే వారినుంచి పాలు సేకరించకుండా శ్రీజ డెయిరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆటో పంపకుండా చేశారని ఆ రైతులు ఆరోపిస్తున్నట్లుగా పచ్చ మీడియా కథనాలను హోరెత్తించింది. 

రైతులు ఆవేశంలో ఆరోపణలు చేయడం సహజమే కావొచ్చు.. కానీ.. ఇంత చిన్న విషయానికి రాష్ట్ర వ్యాప్త ప్రాధాన్యంతో మీడియా అత్యుత్సాహం కనబరచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన శివశక్తి డెయిరీ వారి ఒత్తిడితోనే వీరినుంచి పాలు సేకరించలేదంటూ మరో ఆరోపణను కూడా జత చేశారు. 

ఈ అసత్యప్రచారాలను నమ్ముకుని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రెచ్చిపోయారు. బురద చల్లడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని గోతికాడ నక్కలా కాసుక్కూచుని ఉండే లోకేష్.. రెచ్చిపోయి శివశక్తి డెయిరీ బెదిరిస్తున్నదంటూ ఎడాపెడా విమర్శలు చేసేశారు. తీరా ఒక్కరోజు గడిచేసరికి అంతా తిరగబడింది. 

ఏ పాడిరైతులు, పాల ఏజెంట్ అయితే ఆరోపణలు చేశారో.. వారే అసలు సంగతి చెప్పారు. ఆటో ఖర్చు ఎక్కువ కావడం వల్ల శ్రీజ డెయిరీ పంపలేదని, అంతకు మించి ఇతర కారణాలు లేవని అన్నారు. శివశక్తి డెయిరీ మేనేజర్ పేరును ఆవేశంలో అనవసరంగా వాడాం అని.. వారికి క్షమాపణ కూడా చెప్పారు. వాస్తవాన్ని వారు అర్థం చేసుకున్నారు. 

ఈ పాడిరైతుకు ఉన్న విజ్ఞత సంస్కారం నారా లోకేష్ కు ఉంటే.. ఆ అసత్య ఆరోపణలను ఆధారం చేసుకుని మంత్రి పెద్దిరెడ్డి మీద నిందలు వేసినందుకు.. లోకేష్ కూడా సారీ చెప్పాలి. అయినా.. కనీస పరిపక్వత కూడా లేని ఇలాంటి నాయకుడి నుంచి అంత సంస్కారాన్ని ఆశించడం కూడా తప్పే. ఒక అసత్యం ఆధారంగా రెచ్చిపోయి తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఇప్పుడు లోకేష్ మొహం ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి!!