ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అందరూ నుంచి వస్తున్న ఒకటే ఒక ప్రశ్న ఇన్ని రోజులు అమరావతి యాత్రను ఎవరు చేశారు? అనేది పెద్ద క్యూస్షన్ మార్క్ గా కనబడుతోంది. ఎందుకంటే హైకోర్టు చెప్పినట్లు 600 మంది రాజధాని ప్రాంత రైతులు మాత్రమే పాల్గొనాలి అన్న కండిషన్ పెట్టినప్పటి నుంచి అమరావతి యాత్ర వాయిదా పడింది. దానికి రకరకాలు కారణాలు చెప్పుతున్న అందులో అమరావతి రైతులు పాల్గొనడం లేదనేది అందరు అనుకుంటూన్నారు. అందుకే వాయిదా వేసీ కోర్టుకు వెళ్లారంటూన్నారు.
అసలు ఇన్ని రోజులు అమరావతి యాత్ర ఎవరు చేశారు? రైతుల ముసుగులో టీడీపీ తన సామాజిక వర్గ నేతల అండదండలతో చేపించిందా లేకపోతే వైసీపీ నేతలు ఆరోపించినట్లు పెయిడ్ ఆర్టిస్టులతో యాత్ర ఎన్ని రోజులు కొనసాగిసిందా? అనేది తెలియాల్సి ఉంది. నిజంగా అమరావతి రైతులు ఆ యాత్రలో పాల్గొంటుంటే కోర్టులతో అవసరమే లేదని.. ఎందుకంటే హైకోర్టు ఇంతముందుగానే పోలీసులు దగ్గరుండి అమరావతి రైతుల యాత్రకు భద్రత ఇవ్వలాని, వారిని యాత్ర కొనసాగించాలని తీర్పు కూడా ఇచ్చింది
హైకోర్టు తీర్పును పోలీసులు పాటించడంతో అసలు సమస్య బయటకు వచ్చింది. అసలు అమరావతి యాత్రలో ఇన్ని రోజులు ఎవరు పాల్గొన్నారు. ఆ యాత్రలో అమరావతి సంబంధించిన రైతులు ఉన్నారా లేక ఒక వర్గంవారు చేసిన పెయిడ్ యాత్రనా అనేది అందరి నుండి వస్తోంది. గతంలో అమరావతి-తిరుపతిలో బయటపడని నిజాలు అన్ని అమరావతి-అరసవెళ్లి యాత్రలో బయటపడుతున్నాయి.
మొత్తానికి అమరావతి యాత్ర ఇప్పట్లో మొదలు కాకపోతే మాత్రం రాష్ట్రంలోని మిగతా ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు వైసీపీ చెపుతున్నట్లు ఆ యాత్రలో ఉన్నది కేవలం సామాజిక వర్గ చెందిన ఒక పార్టీ నేతలు అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికై ప్రజల నుండి ఎటువంటి స్పందన లేని యాత్ర ఇకపై మరింత చూలకన ఏర్పడుతోందంటూన్నారు విశ్లేషకులు.