నారా లోకేష్ జైలు భయంతో ఏపీకి రావడం లేదని, అందుకే ఆయన ఢిల్లీలో కూర్చున్నాడనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అరేయ్.. తురేయ్.. అంటూ మొన్నటి వరకూ వీధుల్లో తన వదరబోతుతనాన్ని చాటుకున్న లోకేష్..తీరా అసలు కథ మొదలయ్యే సరికి ఢిల్లీలో కూర్చోవడంతో లోకేషుడి హీరోయిజం రేంజ్ ఏమిటో బయటపడింది!
ఎర్రబుక్కులో ఇప్పుడు ఎవరెవరి పేర్లు రాస్తున్నారో కానీ, లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను వేసుకున్నారు. ఈ కేసులో లోకేష్ పేరు ఏ14 గా ఉండగా.. తనకు ముందస్తు బెయిల్ కేటాయించాలంటూ లోకేష్ పిటిసన్ వేసుకున్నారు.
ఇలా లోకేష్ అరెస్టు భయం బట్టబయలైంది. ఏపీకి వస్తే తనను అరెస్టు చేస్తారనే భయంతో లోకేష్ ఢిల్లీలో ఉన్నారనే ప్రచారానికి ఈ పిటిషన్ మరింత ఊతం ఇస్తోంది. తను తప్పు చేయకపోతే లోకేష్ ఎందుకు అరెస్టుకు భయపడుతున్నాడో మరి!
అందునా తన తండ్రి జైలు పాలైన నేపథ్యంలో… లోకేష్ ఈ పరిణామాలను ధైర్యంగా ముందుకు వచ్చి ఎదుర్కొని ఉంటే.. సరిపోయేది. అయితే పాదయాత్రలో బీరాలు పలికిన లోకేష్ అరెస్టుకు భయపడి ఢిల్లీ పారిపోయాడనే ముద్ర శాశ్వతంగా ఉండిపోతుంది. దీన్ని కవర్ చేయడానికి పచ్చమీడియా ఎంత ప్రయత్నించినా ప్రయోజనం కూడా ఉండదు!
అయినా.. చంద్రబాబు జైలు కెళ్లే తమకు బోలెడంత సానుభూతి వచ్చేసిందని, మొన్నటి వరకూ తమ విజయంపై ఏవైనా అనుమానాలు ఉంటే అవి చంద్రబాబు అరెస్టుతో పటాపంచలు అయ్యాయని పచ్చవర్గాలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు.. లోకేష్ కూడా అరెస్టైతే ఇంకా ఎక్కువ సానుభూతి వస్తుంది కదా!
చంద్రబాబు జైల్లో ఉంటే సానుభూతి వచ్చేట్టుగా అయితే.. లోకేష్ కూడా అరెస్టై జైలుకు వెళితే తండ్రీకొడుకుల అరెస్టుతో మరింత సానుభూతి పెల్లుబుకుతుంది కదా! మరి లోకేషుడు ఎందుకు ఇంకా జైలుకు వెళ్లకుండానే బెయిల్ పిటిషన్ వేసుకున్నట్టు?