బాలయ్య చిన్నల్లుడికి టిక్కెట్‌ దక్కుతుందా…?

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యా సంస్ధల చైర్మన్‌ శ్రీభరత్‌కు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది.  Advertisement ఆయనకు ఎందుకు…

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యా సంస్ధల చైర్మన్‌ శ్రీభరత్‌కు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది. 

ఆయనకు ఎందుకు టిక్కెట్‌ రాదు, స్వయంగా లోకేష్‌కు తోడల్లుడు, బాలయ్య అల్లుడు కాబట్టి తప్పకుండా టిక్కెట్‌ ఇస్తారని అనుకోవచ్చు. కానీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకుండా పై స్ధాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. లోకేష్‌కు అటూ ఇటూ ఎవరూ పోటీగా ఉండకూడదు అన్నది చంద్రబాబు విధానం అని అంటారు. 

ఇక శ్రీభరత్‌ చూస్తే విద్యాధికుడు, రాజకీయ కుటుంబ నేపధ్యం కలిగిన వారు. ఆయన తల్లి వైపు తండ్రి కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత. ఇక తండ్రి వైపు తండ్రి ఎంవీవీఎస్‌ మూర్తి విశాఖ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఎమ్మెల్సీగా ఉంటూ మరణించారు. ఆ విధంగా ఆయనకు రాజకీయంగా పట్టుంది. 

అంగబలం, అర్ధబలం నిండుగా ఉన్నాయి. దాంతో రేపటి రోజున టీడీపీలో ఆయన ఓ పవర్‌ సెంటర్‌ అవుతారన్న అనుమానాలతో ఆయనకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ నిరాకరించవచ్చు అన్న ప్రచారం సాగుతోందిట. తనకు విశాఖ ఎంపీ టిక్కెట్‌ అయినా లేక భీమిలీ ఎమ్మెల్యే టిక్కెట్‌ అయినా ఇవ్వాలని శ్రీభరత్‌ గట్టిగా కోరుకుంటున్నారు. కానీ భీమిలీ టిక్కెట్‌ను ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబుకు ఇస్తారని టాక్‌. 

ఇక విశాఖ ఎంపీ టిక్కెట్‌ను పొత్తులలో ఏ పార్టీ అడగకపోతే బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు ఇస్తారని అంటున్నారు. మరి శ్రీభరత్‌కు ఈసారి రిక్త హస్తమేనా అంటే ప్రచారాన్ని బట్టి చూస్తే అంతే అని అంటున్నారు.