భాజపా ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలొకి రాగానే తెలుగుదేశానికి బై బై చెప్పి జంప్ జిలానీ అన్నారు ఎంపీ సుజన చౌదరి. అయితే జంప్ చేయలేదు…చంద్రబాబు నే భాజపాతో లాబీయింగ్ కోసం పంపారు అని టాక్ వినిపించింది. ఇప్పటికీ సుజన చంద్రబాబు మనిషే అన్న క్లారిటీ వచ్చింది. సుజన ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన ఇచ్చిన సమాధానాలే ఈ విషయం చెబుతున్నాయి.
చంద్రబాబు ఎప్పటికీ నా శ్రేయోభిలాషి.
నేను కూడా చంద్రబాబు శేయోభిలాషినే.
తెలుగుదేశం విశాఖ ఎమ్మెల్యే వైకాపాలోకి జంప్ చేస్తారని నాకు ఒక్క రోజు మందు తెలిసి వున్నా ఆపేవాడిని.
ఆంధ్ర పరిస్థితి దారుణంగా వుంది.
ఆంధ్ర జనాలు మరోసారి తప్పు చేయకూడదని కోరుకుంటున్నా.
జగన్ మీద భాజపాకు ప్రేమ ఏమీ లేదు.
ఆంధ్ర విషయం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా భాజపా అధిష్టానం అనుమతి రావడానికి చాలా ఆలస్యం అవుతోంది.
అరుణ్ జైట్లీ వల్ల భాజపాలోకి వచ్చాను. భవిష్యత్ లో ఏం చేయాలన్నది, ఏ పార్టీలోకి వెళ్తాను అన్నది ఇప్పుడే చెప్పలేను.
ఇవీ సుజన చౌదరి ముచ్చట్లు కొన్ని.. ఇప్పుడు చెప్పండి…భాజపాలోకి సుజన వెళ్లారా? బాబు పంపారా? సుజన భాజపా మనిషా? చంద్రబాబు మనిషా? భవిష్యత్ తెలుగుదేశంలోకి సుజన మల్లీ రారు అన్న గ్యారంటీ వుందా?