పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు వంటివి ప్రభుత్వం చేస్తుంది. దాని కోసం ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున బడ్జెట్ నుంచి నిధులను కేటాయిస్తోంది. కొన్ని లక్షల మందికి ఏపీలో పెన్షన్లు ప్రభుత్వం ఇస్తోంది. ఇంకా రాని వారు అర్హులు ఎవరైనా ఉంటే వారిని దరఖాస్తు చేసుకోమంటోంది.
అలా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పెన్షన్ అందేలోగా తన వంతుగా ఆర్ధిక సాయం చేయాలని ఒక వైసీపీ నేతకు మంచి ఆలోచన కలిగింది. దాంతో ఆయన ప్రతీ నెలా తన సొంత నిధులను వెచ్చింది అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి ఆడారి ఆనంద్ కుమార్ ఈ విధంగా సామాజిక పెన్షన్లు అందచేస్తూ పేదలను ఆదుకుంటున్నారు. దాంతో వారంతా తమకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేంతవరకూ వైసీపీ నేత ఆర్ధికంగా ఆసరాగా నిలబడడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వేళ హామీలు నేతలు ఇస్తారు. ఆ తరువాత మరచిపోతారు. మరికొందరు ఎన్నికల సమయంలో తాయిలాలు ఇస్తారు. కానీ ఆపన్నులకు సరైన సమయంలో సాయం చేయడమే నిజమైన నాయకుడి లక్షణం. ఆ విధంగా ఆ వైసీపీ నేత మంచి మనసు చాటుకున్నారు అని అంటున్నారు. మరి ఇలా నాయకులు జనాల కోసం పనిచేస్తూ వారి కష్టంలో తోడుంటే అంతకంటే స్పూర్తి మరోటి ఉండదు అని అంటున్నారు.
ఫలానా వారికి పెన్షన్లు రాలేదు, ఆగిపోయాయని యాగీ చేసే వారిలో కొందరినా ఇలా ముందుకు వస్తే తమ చేతలతో సాయం అన్నది చూపిస్తే పేదలకు అసలైన మేలు అదే కదా అన్న వారూ ఉన్నారు. కానీ రాజకీయం చేయాలి, తపు చూపించాలని చూసే వారికి రచ్చ మాత్రమే కావాలి. ఈ ధోరణి మారితేనే పేదరికం కూడా మారుతుంది.