టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి నెటిజన్ల చేతికి చిక్కారు. ఇందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కారణం కావడం విశేషం. నెటిజన్లకు ఆత్మీయ మిత్రుడు లోకేశ్ అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే లోకేశ్ సగం జీవితం సోషల్ మీడియాలోనే గడుపుతారనే పేరుంది.
తాజాగా లోకేశ్‌పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. లోకేశ్ భార్య బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లద్దాక్‌లోని లేహ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై బ్రాహ్మణి రైడ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. బైక్ రైడింగ్ అనుభవాల్ని ఆమే స్వయంగా పంచుకున్నారు. ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సందర్భంలో లోకేశ్‌పై నెటిజన్లు సెటైర్స్ విసరడం గమనార్హం. బ్రాహ్మణి స్పోర్ట్స్ బైక్‌ను సునాయాసంగా కొండల్లో రైడ్ చేస్తున్నారని, కానీ లోకేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కనీసం సైకిల్‌ను సరిగా నడపలేని పరిస్థితి వుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఒకట్రెండు సెటైర్స్ కాదు, భారీగా పంచ్‌లు కురిపిస్తూ లోకేశ్‌ను ఆడుకుంటున్నారు.
స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న బ్రాహ్మణికి నారా వారి చేతుల్లో బందీ అయిన సైకిల్‌ను విడిపించుకుని, రైడ్ చేస్తే చూడాలని వుందని, అలాగే లోకేశ్‌కు సైకిల్ నడపడం నేర్పించమ్మా అని మరికొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. బ్రాహ్మణి స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేస్తోంది, తమరు పార్టీ గుర్తు అయిన సైకిల్‌ను అధికారం దిశగా నడిపేదెన్నడు లోకేశా అనే సెటైర్స్ విసరడం గమనార్హం.
టీడీపీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ కేంద్రంగా, బ్రాహ్మణి బైక్ రైడింగ్ అంశాన్ని తీసుకుని లోకేశ్‌పై పంచ్‌లు కురిపించడం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.