జనసేనాని పవన్‌కల్యాణ్ ఇవాళ చేసిన ట్వీట్లపై ఏపీ మంత్రులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికలుగా చేసుకుని పవన్‌కల్యాణ్‌ను ఉతికి ఆరేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్‌కల్యాణ్‌పై ట్రోలింగ్‌కు మంత్రులే శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది.
దత్తపుత్రుడు, మియావ్ …మియావ్, అలాగే బానిస బతుక్కేం తెలుసు అనే ప్రశ్నతో పవన్‌ను పరోక్షంగా చంద్రబాబు కోసం ట్వీట్లు చేశారనే సంకేతాల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ముఖ్యంగా మంత్రులు గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుడివాడ ట్వీట్ ఏంటంటే…
“దత్త తండ్రి తరఫున.. దత్త పుత్రుడి మియావ్ మియావ్…! అంటూ మంత్రి చేసిన ట్వీట్‌ను వైసీపీ సోషల్ మీడియా జనంలోకి బాగా తీసుకెళుతోంది. దత్తపుత్రుడనే పేరు పవన్‌కు స్థిరపడిపోయేలా వైసీపీ చేసింది. ఇక మరో మంత్రి దాడిశెట్టి రాజా మరింత దూకుడుగా ట్వీట్ చేశారు.
“బానిస బతుక్కేం తెలుసు.. సింహ గర్జన పవర్, నీ అరుపులు CBN కోసం.. మా గర్జన రాష్ట్రం కోసం.. ఎవరెన్ని మొరిగినా మా విధానం వికేంద్రకరణే” అంటూ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. పవన్‌కల్యాణ్‌ది బానిస బతుకుగా అభివర్ణించారు. తాము రాష్ట్రం కోసం నినదిస్తుంటే, పవన్ మాత్రం చంద్రబాబు కోసం అరుస్తున్నారని ఆయన వెటకరించారు.