నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ వైసీపీ సునామీలో ప్రత్యర్థి బీజేపీ గల్లంతు అయ్యింది.
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,888 ఓట్ల భారీ మెజార్టీతో తిరుగులేని విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డికి 1.02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌కు 19,352 ఓట్లు దక్కాయి. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం బరిలో నిలిచింది. మిత్రపక్షమైన జనసేన కూడా చివరికి బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడం విశేషం.
చివరికి ఒంటరిగానే బీజేపీ తలపడాల్సి వచ్చింది. కనీసం ఏజెంట్లను కూడా పెట్టుకునే పరిస్థితి కరువైంది. మరోవైపు వైసీపీ లక్ష మెజార్టీ లక్ష్యంగా బరిలో నిలిచింది. అయితే ఓటింగ్ శాతం 2019తో పోల్చుకుంటే దాదాపు 20 శాతం తగ్గింది. దీంతో టార్గెట్ మెజార్టీకి దూరంగా నిలవాల్సి వుంటుందేమోనని వైసీపీ భయపడింది.
మొత్తం 20 రౌండ్ల లెక్కింపునకు గాను, మొదటి రౌండ్ నుంచే వైసీపీ హవా కనబరిచింది. ప్రతి రౌండ్‌లో కూడా అనుకున్న మెజార్టీ సాధించడం విశేషం. చివరికి 82,888 ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలో తనకు తిరుగులేదని వైసీపీ ఈ ఎన్నిక ద్వారా చాటి చెప్పింది.