కాకినాడ జిల్లా బెండపూడి హైస్కూల్ విద్యార్థిని మేఘనపై పచ్చ బ్యాచ్ దుష్ప్రచారానికి తెగబడింది. ఇటీవల వెలువడిన టెన్త్ ఫలితాల్లో మేఘన రెండు సబ్జెక్టుల్లో తప్పిందని పచ్చ బ్యాచ్ సంబరపడి, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడింది. అయితే తాను 600కు 478 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించినట్టు మేఘన అసలు విషయాన్ని చెప్పే సరికి ఎల్లో గ్యాంగ్‌కి దిమ్మ తిరిగింది.
ఈ విద్యార్థినినే ఎల్లో బ్యాచ్ టార్గెట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇటీవల బెండపూడి హైస్కూల్‌కు చెందిన గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్‌లో అద్భుత ప్రదర్శన కనబరచడం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. వారిని సీఎం తన వద్దకు పిలిపించుకున్నారు. అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్లో గ్రామీణ విద్యార్థులంతా మాట్లాడ్డం చూసి సీఎం జగన్ ఎంతో సంతోషించారు. నాడు-నేడు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన లాంటి విప్లవాత్మక విద్యా సంస్కరణలు తీసుకురావడం వల్ల పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదుగుతున్నారనే మెసేజ్ వెళ్లింది.
ఈ నేపథ్యంలో సీఎంతో సమావేశమై, చక్కటి అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడిన మేఘన టెన్త్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిందని, ఆమె యాసను ఎగతాళి చేస్తూ ఎల్లో బ్యాచ్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం గమనార్హ. తనను ట్రోల్ చేయడంపై విద్యార్థిని మేఘన దీటుగా తిప్పికొట్టింది. తనకు 478 మార్కులు వచ్చినట్టు ఆధారాలను బయట పెట్టింది. తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని, లక్ష్యంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేసింది.
ఇదిలా వుండగా చదువుల తల్లి సరస్వతి ముద్దుబిడ్డను ట్రోల్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేయడానికి సిగ్గు లేదా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. మీ ఇళ్లలో ఎవరైనా ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన, గొప్ప ప్రతిభ చూపిన, ఆఖరుకు పాస్ కావడం కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళున్నా సరే — మాకు చెప్పండి, మనసారా అభినందించుతాం! అని నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం.
“అది చదువు రా, అది సంస్కారం నేర్పుతుందిరా, దానికి విలువ ఉందిరా, అది ఒక విద్యావంతుడి నుంచి దొంగలించలేని గొప్ప సంపదరా, దానిమీద రాజకీయం ఏమిట్రా ! చదువురాని వెధవల్లారా ! చదువు అమ్ముకునే వ్యాపారుల్లారా! ఆంధ్రప్రదేశ్‌లో చదువులను అమ్మకపు సరుకుగా మార్చేందుకు కుట్ర చేసిన రాజకీయ నాయకుల్లారా ” అంటూ మరికొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం.
“విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది! నా రాష్ట్ర భవిష్యత్తు మేఘన లాంటి అమ్మాయిల చదువులతో కొత్త పుంతలు తొక్కుతుంది” అనే కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి.