యూత్ ఫుల్ సినిమా అంటే క్రేజీ గా సమ్ థింగ్ వుండాలి. అందుకే షికారు సినిమాలో అలాంటి క్రేజీ సాంగ్ ఒకటి సెట్ చేసారు. ‘దేవదాస్..పారు వల్ల బ్యాడ్’ అన్న ధీమ్ తో ఈ సాంగ్ సాగుతుంది. అంటే అమ్మాయిల ప్రేమలో పడితే అబ్బాయిలు అంతే అనేనా? ఇంకేమైనా వుందా అన్నది పాట విని తెలుసుకోవాలి. షికారు సినిమా కోసం రూపొందించిన ఈ సాంగ్ ను పలువురు సెలబ్రిటీల సమక్షంలో విడుదల చేసారు.
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు`. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (వైజాగ్ సాయిరామ్ బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. శేఖర్ చంద్ర సంగీతం. సాంగ్ విడుదల సందర్భంగా నటుడు చమక్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీకరించారు. అది నేను ఊహించలేదు. ఇందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.
చిత్ర దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ, నేను ఎంటర్టైన్మెంట్ను బలంగా నమ్మే వ్యక్తిని. ఓ సాంగ్ ద్వారా యూత్‌కు మెసేజ్ చెప్పాలనిపించింది. పాటను రాయాలని నలుగురు గీతరచయితలను అనుకున్నాం. కానీ నా ఐడియాకు సింక్ కాకపోవడంతో పాట ఇలా వుండాలని వారికి చెప్పేందుకు రాస్తుండగా ఆటోమేటిక్‌గా పూర్తి పాట రాసేశాను. జూన్ 24న సినిమా విడుదల కాబోతోంది. కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. నాకు మొదటి సినిమాగా అవకాశం ఇచ్చిన బాబ్జిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
చిత్ర నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, చాలా కథలు విన్నాను. రాజ్‌తరుణ్‌తో సినిమా తీయాలని వచ్చాను. కానీ ఈ కథ విన్నాక అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఐదు నిముషాల్లో కథను ఓకే చేశా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సమాజంలో జరుగుతున్న ఇష్యూను ఫన్‌గా తీశాం.
మా సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా వున్నాయి. `మనసు దారి తపప్పినే` సిద్ద్ శ్రీరామ్ పాడిన పాట పాపులర్ అయింది. `ఫ్రెండ్షిప్`పై రాసిన రెండో పాట కూడా అంతేరీతిలో వుంది. షికారు సినిమా జూన్ 24న విడుదలవుతుంది అని అన్నారు.