ఈమధ్య చంద్రబాబు, లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. బోకేష్, జోకేష్ అంటూ చినబాబు పేరుని చీల్చి చెండాడారు. ఇప్పుడు నారావారి ఇంటిపేరుకి కూడా కొత్త అర్థం చెప్పారాయన.
నారా అంటే నాసిరకం రాజకీయం అంటున్నారు. నాసిరకం రాజకీయాలు చేస్తున్న నాయుడు బాబు.. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే అవకాశవాది అంటూ మండిపడ్డారు.
మాస్ ర్యాగింగ్ ఎందుకంటే..?
గతంలో సీబీఐకి ఏపీలో ఎంట్రీలేదని తేల్చి చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పదే పదే సీబీఐ జపం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే అనుమానాస్పద మరణాలు పెరిగిపోతాయని అన్నారు. దీనికి కౌంటర్ గా విజయసాయి నాసిరకం రాజకీయ నాయకుడంటూ బాబు పరువు తీసేశారు.
రెండు నాల్కల ధోరణితో చంద్రబాబు సీబీఐ గురించి అప్పుడలా, ఇప్పుడిలా మాట్లాడుతున్నారని అన్నారు.
పబ్లిక్ ప్లేస్ లో క్యాంటీన్లేంటి..?
మంగళగిరిలో అన్నక్యాంటీన్ వ్యవహారం ఇటీవల బాగా హైలెట్ అయింది. పేదలకి అన్నం పెడుతుంటే, వైసీపీవాళ్లు చూసి ఓర్చుకోలేక, అన్న క్యాంటీన్ సముదాయాన్ని కూల్చేశారంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసింది. అసలు అనుమతి లేకుండా, పబ్లిక్ ప్లేస్ లో క్యాంటీన్ ఎలా పెడతారంటూ నిలదీశారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబు దోచుకున్న లక్షల కోట్ల రూపాయలతో ఒక్క మంగళగిరిలో ఏం ఖర్మ.. తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు నడపొచ్చంటూ సెటైర్లు వేశారు. పదేళ్లపాటు ఫ్రీగా భోజనాలు పెట్టినా.. చంద్రబాబు సంపద ఉల్లిపొట్టంత కూడా తగ్గదని అన్నారు. 2 ఎకరాలనుంచి 5 లక్షలకోట్లు ఎలా సంపాదించాడో.. చంద్రబాబు గురించి జాతీయ మీడియా ఆధారాలతో సహా రాసిందని చెప్పారు విజయసాయిరెడ్డి.