టాలీవుడ్ లో చాలా మెటిక్యులస్ బిజినెస్ మన్ ఎవరు అంటే సురేష్ బాబు తరువాతే. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే టైపు. రానా, వెంకీ లతో సినిమా అంటే దానికి ముందుగా సురేష్ బాబు వుంటారు.
ఎన్ని రకాల స్కీములు, లెక్కలు, డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా అంటే చాలా వుంటాయి. సినిమా విడుదలకు ముందు అంతా సెటిల్ అయిపోవాల్సిందే. లేదంటే లేదు.
విరాట పర్వం సినిమా విషయంలో కూడా ఇప్పుడు ఇలాగే వుంది వ్యవహారం అని వినిపిస్తోంది. ఈ సినిమాకు రానా హీరో కావడం వల్ల ప్రాజెక్టు సురేష్ కాంపౌండ్ కు వెళ్లింది. సినిమా క్వాలిటీ, మేకింగ్ ఇలా చాలా అంటే చాలా కిందా మీదా అయ్యారు.
నెట్ ఫ్లిక్స్ కు టోటల్ గా ఇవ్వడం, లేదా థియేటర్ తో పాటు ఇవ్వడం అనే రెండు రకాల అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆఖరికి రెండవదే ఫైనల్ అయింది. సినిమా విడుదలకు అంతా రెడీ అయింది. కానీ నెట్ ఫ్లిక్స్ నుంచి అప్పుడే డబ్బులు రావు.
నిర్మాణంలో భాగస్వామ్యం వున్నారు కనుక సురేష్ బాబు కూడా అన్నీ భరించాలి. కానీ ఈ సినిమాకు ఫైనాన్స్ కూడా ఆయనే అని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే తన ఫైనాన్స్ క్లియర్ చేయమని నిర్మాతను వత్తిడి చేస్తున్నట్లు వినిపిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ అమౌంట్ వచ్చే వరకు ఆగడం లేదని బోగట్టా. దీంతో నిర్మాత ఆ సన్నాహాల్లో వున్నారు. ఈ మాత్రం దానికి భాగస్వామి అంటే ఏమిటో అర్థం?
అందుకే ఎంతో అవశ్యం అయితే తప్ప వెంకీ, రానా ల దగ్గరకు నిర్మాతలు వెళ్లడం లేదు. వెళ్తే సురేష్ బాబు గీసే గీతలు అన్నీ దాటాల్సి వుంటుంది. అది అంత వీజీ కాదు.