ఈవీఎంల వెరిఫికేషన్ కి వైసీపీ రెడీ

ఏపీలో టోటల్ గా సీట్లు గల్లంతు అయి వైసీపీ ఎన్నడూ చూడని పరాజయాన్ని చవి చూసింది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది ఆ తరువాత మెల్లగా ఈవీఎంల టాంపరింగ్ అని వైసీపీ నేతలు…

ఏపీలో టోటల్ గా సీట్లు గల్లంతు అయి వైసీపీ ఎన్నడూ చూడని పరాజయాన్ని చవి చూసింది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది ఆ తరువాత మెల్లగా ఈవీఎంల టాంపరింగ్ అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అని జగన్ లేటెస్ట్ గా ట్వీట్ చేయడంతో ఈవీఎంల వల్లనే వైసీపీ ఓటమి చెందినట్లుగా భావిస్తోంది అన్నది స్పష్టం అవుతోంది.

ఈ క్రమంలో ఏపీలో కొన్ని అనుమానిత అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా విజయనగరం జిల్లాలోని మూడింటిని ఎంచుకుంది అని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ తరఫున ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది.

విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్ల లోని ఒక పోలింగ్ కేంద్రం, అలాగే గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వైసీపీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వచ్చినట్లు తెలుస్తోంది.

దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే నాలుగు వారాలలోగా ఈసీ ఈవీఎంలను వెరిఫికేషన్ చేస్తుంది. ఆ విధంగా వైసీపీ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. వైసీపీ ఎంచుకున్న పోలింగ్ స్టేషన్లలో అత్యధిక శాతం ఒక పార్టీకే ఓట్లు పడినట్లుగా చెబుతున్నారు. మరి దీని మీద రీ వెరిఫికేషన్ లో ఏమి తేలుతుంది అన్నది చూడాలి.

ఏమైనా తేడా వస్తే కనుక వైసీపీ ఈవీఎంల మీద వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం పూర్తిగా చేకూరే అవకాశం ఉండొచ్చు.