జ‌కియాను వైసీపీ.. ఆ పార్టీని భ‌ర‌త్ వ‌ద్దనుకున్నారు!

అధికార పార్టీకి అంద‌రూ ఆప్తులే. ముస్లిం మైనార్టీకి చెందిన మ‌హిళ అనే కార‌ణంతో అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటికి చెందిన జ‌కియా ఖానంకు ఎమ్మెల్సీ ప‌ద‌విని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చి గౌర‌వించారు. అలాగే చంద్ర‌బాబునాయుడిపై కుప్పంలో…

అధికార పార్టీకి అంద‌రూ ఆప్తులే. ముస్లిం మైనార్టీకి చెందిన మ‌హిళ అనే కార‌ణంతో అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటికి చెందిన జ‌కియా ఖానంకు ఎమ్మెల్సీ ప‌ద‌విని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చి గౌర‌వించారు. అలాగే చంద్ర‌బాబునాయుడిపై కుప్పంలో పోటీ చేసిన భ‌ర‌త్‌కు అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో భ‌ర‌త్‌కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ప‌ద‌వులు ఇవ్వ‌డంతో త‌న బాధ్య‌త నెర‌వేరింద‌ని జ‌గ‌న్ అనుకున్నారు.

అయితే ఎలాంటి వాళ్ల‌కు ప‌ద‌వులు ఇస్తున్నామ‌నే విష‌యాన్ని జ‌గ‌న్ ఒక్క నిమిషం కూడా ఆలోచించ‌లేదు. కేవ‌లం అధికారం ఉన్నార‌నే ఏకైక కార‌ణంతో వాళ్లంతా త‌న వెంట న‌డుస్తున్నార‌ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోయారు. అందుకే ఎమ్మెల్సీలు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ జ‌కియా ఖానంతో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని శాన‌స‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. తిరుమ‌ల‌లో వీఐపీ ద‌ర్శ‌న టికెట్లు ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యించార‌నే ఫిర్యాదుపై తిరుమ‌ల‌లో ఎమ్మెల్సీ జ‌కియాపై కేసు న‌మోదు చేశారు. దీంతో జ‌కియా అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల ఆమె మంత్రులు నారా లోకేశ్‌, ఫ‌రూక్‌ను క‌లిశారు.

తాను టీడీపీలో చేర‌డానికి వెళుతుండ‌గా వైసీపీ నేత‌లు కుట్ర‌పన్ని తిరుమ‌ల వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల విక్ర‌యం కుట్ర‌లో ఇరికించార‌ని జ‌కియా ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఆమె టీడీపీలో అధికారికంగా చేర‌డం ఖాయం.

ఇక ఎమ్మెల్సీ భ‌ర‌త్ విష‌యానికి వ‌స్తే… ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న అడ్ర‌స్ లేకుండా పోయారు. కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న ఆచూకీ లేక‌పోవ‌డంతో వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మాత్రం విచ్చ‌ల‌విడిగా సంపాదించుకుని, ఇప్పుడు క‌ష్ట‌కాలంలో క‌నిపించ‌కుండా పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అందుకే ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు వైర‌ల్ అవుతోంది. కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ భ‌ర‌త్ క‌నిపించ‌డం లేద‌ని, ఆయ‌న గురించి తెలిస్తే, వెంట‌నే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాలంటూ సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. భ‌ర‌త్ వ్య‌వ‌హార శైలి చూస్తుంటే, వైసీపీలో కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

8 Replies to “జ‌కియాను వైసీపీ.. ఆ పార్టీని భ‌ర‌త్ వ‌ద్దనుకున్నారు!”

  1. ఎవరితోనైనా అవసరం ఉంటుంది అని అనుకుంటేనే వారికి పదవులు ఇస్తారు. పదవులు స్వీకరించిన వారు కూడా ఏ పార్టీ లో కొనసాగితే ఫలితం ఉంటుంది అనే ప్రాతిపదిక పైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది సగటు రాజకీయ నాయకుడి సహజ సిద్ధమైన గుణం.‌ ఇందులో ఎవరినీ తప్పు పట్టవలసిన అవసరం లేదు. మన పార్టీ లో చేరిన వాడు మంచివాడు, మన పార్టీ నుంచి వేరే పార్టీ లో చేరే వాడు పనికిమాలిన వాడు అనడం సబబు కాదు.‌

    GA Reddy గారికి అనవసరమైన ఆందోళన పనికిరాదు.

  2. పార్టీ నేత నే ప్రతివారం బెంగళూర్ లో హాలీడే ట్రిప్ కి వెళ్తూ వుంటే, మిగతా వాళ్ళని మాత్రం పని చేయమనడం ఎంత వరకు సబబు వెనకటి రెడ్డి ?

    ముందు ఆ పార్టీ నేత నీ రోజు తన నియోజక వర్గ లో ప్రజలకి అందుబాటులో వుండమని చెప్పు. అసెంబ్లీ కి వచ్చి తన నియోజక వర్గం లో ఇబ్బందుల గురించి , గత 5 ఏళ్లలో గత సిఎం చేసిన ఆ నియోజక వర్గము కి చేసిన అన్యాయం గురించి మాట్లాడమని చెప్పు.

  3. అవినీతి చెయ్యటానికి దర్మాలూ, మతాలు అడ్డురావు కదా!!లీడర్ లో మంచి గుణాలు మచ్చుకైనా ఉంటేకదా!

Comments are closed.