ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతాన్నే చంద్రబాబునాయుడు పాటిస్తున్నారా? భవిష్యత్తులో కూడా పవన్ కల్యాణ్ తో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేని చంద్రబాబునాయుడు పిఠాపురం తన సొంత పార్టీని పణంగా పెట్టబోతున్నారా? అక్కడ పార్టీని కాపాడుకోవడం, అక్కడి నాయకులను కాపాడుకోవడం, వారికి విలువ ఇవ్వడం అనవసరం అని ఫిక్సయ్యారా? ఇలాంటి రకరకాల అనుమానాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నాయి.
తాజాగా రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను గమనిస్తే.. పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మను చంద్రబాబునాయుడు దాదాపుగా పక్కన పెట్టేసినట్టే అర్థమవుతోంది. ఆయన సేవలు పార్టీకి ఇక అనవసరం అని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టుగానే ఉందని, అభ్యర్థుల ఎంపిక నిర్ణయం.. పిఠాపురం వర్మకు ఎగ్జిట్ డోర్ చూపించడం వంటిదేనని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన చాలా మంది తెలుగుదేశం నాయకులు, నియోజకవర్గ ఇన్-చార్జులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అప్పటి దాకా తమ తమ నియోజకవర్గాల్లో సమయాన్ని, డబ్బును ఖర్చు పెడుతూ.. తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన అనేకమంది హఠాత్తుగా వెనక్కు తగ్గారు.
చంద్రబాబునాయుడు వారందరికీ రకరకాల హామీలు ఇచ్చి, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఆవశ్యకతను వివరించి ఊరడించారు. అలాంటా త్యాగరాజుల్లో పిఠాపురం సీటును చివరి నిమిషంలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ కూడా ఉన్నారు. తనకు జరిగిన అన్యాయం సహించలేకపోయిన వర్మ అప్పట్లో ఇండిపెండెంటుగా నామినేషన్ వేయడానికి సిద్ధపడితే.. చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి.. ఎమ్మెల్సీగా తొలి అవకాశం నీకే ఇస్తానని నమ్మించి పవన్ ను గెలిపించడానికే పనిచేసేలా ఒప్పించారు. పవన్ కల్యాణ్ కూడా వర్మను నెత్తిన పెట్టుకుంటున్నట్టుగానే ఆ ఎన్నికల్లో కనిపించారు. గెలిచిన తర్వాత వర్మను ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు, ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాలకు కలిపి రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలకు అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణా- గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్టు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆలపాటి రాజా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కోసం తన తెనాలి సీటును త్యాగం చేశారు. గతంలో స్థానికసంస్థల ప్రతినిధిగా ఉన్న అనుభవానికి తోడు చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణ చూసిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్! ఆయన కాకినాడ రూరల్ సీటును ఆశించారు గానీ.. జనసేన పంతం నానాజీ కోసం దానిని త్యాగం చేయాల్సి వచ్చింది.
ఈ ఇద్దరికీ చంద్రబాబు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తున్నారు గానీ.. తొలివిడతలోనే మండలికి పంపుతానని హామీ ఇచ్చిన వర్మ గురించి పట్టించుకోవడం లేదు. ఈ సంకేతాలను వర్మ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే ఆయనకే అంత మేలు అని అభిమానులు అనుకుంటున్నారు.
Telusukuni Ami cheyali adi kuda nuvve cheppu
దేవినేని ఉమ ది కూడా అదే పరిస్థితి. 5 ఏళ్లు నియోజక వర్గానికి కష్టపడి చివరి నిముషంలో మైలవరం కి టికెట్ వెళ్ళింది. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాడు. అంతగా వీళ్లకి టికెట్ ఇవ్వాలంటే వేరే నియోజక వర్గం కి ఇవ్వొచ్చుగా కష్టపడిన వాళ్ళని మోసం చేయకుండా.
Call boy works 9989793850
vc estanu 9380537747