బొబ్బిలిలో సరికొత్త నినాదం!

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికల్లో సరికొత్త నినాదంతో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీసీల కోట బొబ్బిలి అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత శంబంగి చిన అప్పలనాయుడు. ఆయన మూడు…

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికల్లో సరికొత్త నినాదంతో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీసీల కోట బొబ్బిలి అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత శంబంగి చిన అప్పలనాయుడు. ఆయన మూడు సార్లు బొబ్బిలిలో గెలిచారు. తెలుగుదేశానికి రెండు సార్లు బొబ్బిలిలో విజయం అందించిన నేతగా ఉన్నారు.

శంబంగి 1983లో తొలిసారి గెలిచారు. ఆనాటి నుంచి రాజకీయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ నాలుగు దశాబ్దాల తరువాత 2024లో తన పొలిటికల్ కెరీర్ లో మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం వైసీపీదే అంటున్నారు. బీసీలకు పట్టం కట్టిన వైసీపీకే జనం మద్దతు ఉంటుందన్నారు.

బీసీలు అంతా ఐక్యంగా ఉంటే రాజుల కోట బద్ధలే అని శంబంగి కీలక వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి రాజులు భయపడేలా బీసీలంతా ఒక్క త్రాటి మీద ఈసారి నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు. బీసీల ఉనికి బలంగా చాటి చెప్పాలని శంబంగి అంటున్నారు.

మరోసారి బొబ్బిలి లో బీసీల జెండా ఎగరేయాలని కోరారు. బీసీలకు వైసీపీ పెద్ద పీట వేసిందని అన్నారు. ఈసారి బీసీలు మళ్లీ గెలిస్తే అది కంచుకోటగా మారుతుందని అన్నారు. బొబ్బిలి రాజులు ఓటమే అంతా పనిచేయాలని ఆయన కోరారు.

శంబంగి చిన అప్పలనాయుడు బొబ్బిలి రాజుల మీద గతంలో అనేక సార్లు పోటీ చేశారు. కొన్ని సార్లు గెలిచారు. 2019లో ఆయన వైసీపీ నుంచి గెలిచి తన సత్తా చాటారు. ఈసారి ఆయనకే అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. దాంతో బొబ్బిలిలో వైసీపీకి హ్యాట్రిక్ విజయం సాధించి పెట్టాలని ఆయన పట్టుదలగా పనిచేస్తున్నారు.