ఈ ఒక్క విషయంలో బుచ్చిబాబు తోపు

ఈరోజు రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామ్ చరణ్, సుకుమార్, జాన్వికపూర్, ఏఆర్ రెహ్మాన్.. ఇలా అంతా మూకుమ్మడిగా బుచ్చిబాబును అకాశానికెత్తేశాడు. ఒక దశలో ఇది మూవీ ఓపెనింగ్ లా కాకుండా..…

ఈరోజు రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామ్ చరణ్, సుకుమార్, జాన్వికపూర్, ఏఆర్ రెహ్మాన్.. ఇలా అంతా మూకుమ్మడిగా బుచ్చిబాబును అకాశానికెత్తేశాడు. ఒక దశలో ఇది మూవీ ఓపెనింగ్ లా కాకుండా.. బుచ్చిబాబు సన్మాన సభలా అనిపించింది.

వాళ్లంతా చెప్పింది ఎంత నిజమో తెలియాలన్నా.. బుచ్చిబాబు సామర్థ్యం ఏంటో తెలియాలన్నా.. మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే అంతకంటే ముందు బుచ్చిబాబు సత్తా ఒకటి బయటపడింది. ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కు ముందే ఏఆర్ రెహ్మాన్ తో 3 ట్యూన్స్ కంపోజ్ చేయించి పెట్టాడు ఈ దర్శకుడు.

ఇది మాత్రం సాధారణ విషయం కాదు. ఈ విషయాన్ని ఈరోజు స్వయంగా ఏఆర్ రెహ్మాన్ బయటపెట్టారు. ఈ సినిమా కోసం 5 డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఇచ్చాడట బుచ్చిబాబు. ఆల్రెడీ 3 ట్యూన్స్ రాబట్టుకున్నాడని వెల్లడించారు రెహ్మాన్.

ఇప్పుడున్న పరిస్థితుల్లో యంగ్ కంపోజర్స్ తో ట్యూన్స్ రాబట్టుకోవడమే తలకుమించిన భారంగా మారింది చాలామందికి. అలాంటిది రెహ్మాన్ తో వర్క్ చేయించుకోవడం మామూలు విషయం కాదు. అందుకే టాలీవుడ్ మేకర్స్ రెహ్మాన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాంటి సంగీత దర్శకుడితో ఆల్రెడీ 3 ట్యూన్స్ రాబట్టుకున్న బుచ్చిబాబును తోపుగా అభివర్ణిస్తోంది సోషల్ మీడియా.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో లాంఛ్ అవ్వాల్సింది. గేమ్ ఛేంజర్ లేట్ అవ్వడం వల్ల ఆ ప్రభావం ఈ మూవీపై పడింది.